అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !!... పవన్ కళ్యాణ్ మరో సంచలనం!
Recommended Video

ఇటీవల జరిగిన పరిణామాలతో తెలుగులో కొన్ని న్యూస్ ఛానల్స్ మీద ఆరోపణలు వర్షం కురిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఆయా ఛానల్స్ రన్ చేస్తున్న అధినేతలను టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీవీ 9 రవి ప్రకాష్, శ్రీనిరాజు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణలను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది. త్వరలోనే "అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !! ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ సొంత మీడియా ఛానల్
ప్రస్తుతం ఏదైనా రాజకీయ పార్టీ మనుగడ సాధించాలంటే దానికి మీడియా సపోర్ట్ చాలా అవసరం అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఆయా పార్టీలకు మద్దతుగా కొన్ని ఛానల్ ఉన్నాయనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ త్వరలో సొంత మీడియా ఛానల్ ప్రారంభించబోతున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి.
ఈ వ్యాఖ్యలతో మరింత బలంగా...
"త్వరలోనే సరదాగ , కాలక్షేపం కోసం "అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !! ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది" అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లతో త్వరలోనే ఆయన టీవీ ఛానల్ ప్రారంభిస్తారని, అందులో ఈ షో రన్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
సెటైర్లు వేయడానికేనా...
"అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !!.... అనే కార్యక్రమంలో సాధారణ చర్చా కార్యక్రమాలు, సాంబ ప్రపంచంలోని గాసిప్ వార్తలు, ఫోటోస్, వీడియోస్ చూపించబోతున్నారట.... ఈ విషయాన్నిపవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు.
ఆసక్తిరేపుతున్న వరుస ట్వీట్స్
ఇందులో స్టీమీ ఎఫైర్స్ గురించి కూడా చూపించబోతున్నమని పవన్ కళ్యాణ్ తెలిపారు. మరి ఈ కార్యక్రమంలో ఎలాంటి సంచలనాలు చూడబోతున్నాం? ఈ షో టీవీ ఛానల్ ద్వారా వస్తుందా? లేక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతుందా? అనేది తేలాల్సి ఉంది.
బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదూసి కొడదాం
RK, please welcome to ""బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదూసి కొడదాం " కార్యక్రమానికి మీకు స్వాగతం.... అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications