OG పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక వీరి ప్రాజెక్టు గురించి గత కొన్ని రోజులుగా అనేక కరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక మొత్తానికి నేడు ఈ సినిమాను హైదరాబాదులో పూజ కార్యక్రమాలతో మొదలుపెట్టారు. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ ఫిల్మ్ గా తెరకెక్కనుంది అని ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. త్రిల్లింగ్ అనిపించే ఎన్నో అంశాలు ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు కూడా చెబుతున్నారు.

అయితే OG ప్రాజెక్టును నేడు పూజా కార్యక్రమాలతో చాలా సందడిగా మొదలు పెట్టారు. ఇక ఈ లాంచ్ వేడుకకు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దిల్ రాజు అల్లు అరవింద్ అలాగే హారిక హాసిని చిన్నబాబు తో పాటు మరికొంతమంది ప్రముఖ నిర్మాతలు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే సినిమాను నిర్మిస్తున్న ఏం రత్నం కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Pawan kalyan new upcoming project OG launched and music director fix

ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటులు వివరాలు అలాగే టెక్నీషియన్స్ వివరాలను కూడా త్వరలోనే తెలియజేయునన్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత DVV దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఓజి ప్రాజెక్టు కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారనే విషయంలో కూడా చాలా రకాల కథనాలు వచ్చాయి.

Pawan kalyan new upcoming project OG launched and music director fix

ముఖ్యంగా అనిరుద్ ఫైనల్ అయినట్లు కూడా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు థమన్ ఈ లాంచ్ కార్యక్రమంలో వేడుకల్లో పాల్గొనడంతో క్లారిటీ వచ్చేసింది. ఇదివరకే భీమ్లా నాయక్ సినిమాకు పవన్ కళ్యాణ్ రేంజ్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించిన థమన్ ఇప్పుడు మరోసారి ఈ స్టార్ హీరోకు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు. దీంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో అయితే ఫైట్స్ సాంగ్స్ ఉండవు అని మొదట టాక్ వినిపించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు థమన్ రావడంతో తప్పకుండా అదిరిపోయే సాంగ్స్ ఉంటాయి అని అనిపిస్తోంది. మరి దర్శకుడు సుజిత్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X