పవన్ 'పులి' తర్వాత ప్రాజెక్టు...

By Staff

Pawan Kalyan
పవన్ కళ్యాణ్ 'పులి' ప్రారంభం కాకముందే తర్వాత చిత్రానికి యేర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'పులి' రిలీజయిన నెలలోనే ఆ సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ సినిమా చెయ్యబోయే నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావు. సూర్య దినపత్రిక అధినేత అయిన నూకారపు సూర్యప్రకాశరావు ఇప్పటికే ఎస్‌పిఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బానర్‌పై 'అదిరందయ్యా చంద్రం', 'బ్రహ్మాస్త్రం' చిత్రాల్ని నిర్మించారు. ఆయన తాజా చిత్రం 'నిన్న నేడు రేపు' విడుదలకు సిద్ధంగా వుంది.

కాంగ్రెస్ నాయకుడు కూడా అయిన నూకారపు దృష్టి టాప్ హీరోల మీద ఎప్పటినుంచో వుంది. దాంతో పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని భావిస్తున్నారు. దానికోసం ఆయన అధిక మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పవన్‌కు 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ చెల్లించినట్లు ఫిల్మ్‌నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం నూకారపు ఇంటికి వచ్చిన పవన్, ఆయనతో కలిసి అక్కడే భోజనం చేశారని తెలిసింది.

ఈ సందర్భంగా 'పులి' పూర్తయిన వెంటనే నూకారపుకు సినిమా చేస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఎవరో నిర్ణయం కాని ఆ ప్రాజెక్ట్ 2009 జనవరిలో మొదలవుతుంది. ఇక త్వరలో సెట్స్ మీదకు 'పులి' గా అడుగు పెట్టబోతున్నాడు పవన్ కల్యాణ్. దానికి ఎస్‌జె సూర్య దర్శకుడనే . 2009 జనవరిలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X