మరో రీమేక్‌లో పవన్ కల్యాణ్ .. కలిసిరాలేదు. మళ్లీ రిస్క్ చేస్తున్న పవర్‌స్టార్
అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించబోయే సినిమా ఏమిటనే విషయంపై ఆసక్తి నెలకొన్నది. జనసేన పార్టీని ఎన్నికల కోసం సమాయత్తం అవుతూనే మరో చిత్రంలో నటిస్తాడనే ఫిలీం నగర్ సమాచారం.
అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించబోయే సినిమా ఏమిటనే విషయంపై ఆసక్తి నెలకొన్నది. జనసేన పార్టీని ఎన్నికల కోసం సమాయత్తం అవుతూనే మరో చిత్రంలో నటిస్తాడనే ఫిలీం నగర్ సమాచారం. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సంతోష్ శ్రీనివాస్ సినిమా తీస్తారనే ఊహాగానాలు వినిపించినా.. అవి అక్కడే ఆగిపోయాయి. తాజాగా పవన్ కల్యాణ్ మరో తమిళ రీమేక్‌లో నటిస్తున్నారనే పక్కా వార్త వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.
Recommended Video


పవన్ కల్యాణ్ రీమేక్స్‌లో
పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు తీసిన రీమేక్‌లో సక్సెస్ శాతం 70-30 శాతం అని చెప్పుకొంటారు. సక్సెస్ సాధించిన వాటిలో బ్లాక్ బస్టర్లు కాగా, ఫ్లాప్ అయినవి మరీ దారుణంగా బోల్తాకొట్టాయి.

ఖుషీ సక్సెస్.. కాటమరాయుడ ఫ్లాప్
సక్సెస్‌లో ఖుషీ, గబ్బర్ సింగ్ టాప్‌లో నిలువగా, కాటమరాయుడు, అన్నవరం లాంటి చిత్రాలు దారుణంగా పరాజయం పొందాయి. అయితే తమిళ రీమేక్ చిత్రాలు పవన్‌కు కలిసిరాలేదనేది సినీ వర్గాల అభిప్రాయం.

కాటమరాయుడితో నిరుత్సాహం
సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఈ మధ్యకాలంలో తమిళ చిత్రం వీరం రీమేక్‌గా వచ్చిన కాటమరాయుడు చిత్రం అభిమానులను నిరుత్సాహానికి గురిచేసింది. కాటమరాయుడు తర్వాత అలాంటి సాహసం చేయకుండా నేరుగా త్రివిక్రమ్‌తో కలిసి అజ్ఞాతవాసి చిత్రంలో నటిస్తున్నాడు.

సంక్రాంతి కానుకగా అజ్ఞాతవాసి
సంక్రాంతి కానుకగా అజ్ఞాతవాసి చిత్రం జనవరి రెండోవారంలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రం తర్వాత తమిళ ఘనవిజయం సాధించిన వేదాలం రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు అనేది తాజా సమాచారం.

వేదాలం రీమేక్‌లో పవన్ కల్యాణ్
వేదాలం చిత్రంలో అజిత్ హీరో. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రం ఆధారంగా రూపొందబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నట్టు సమాచారం.

ఏఎం రత్నం నిర్మాతగా
వేదాలం చిత్ర రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారనే విషయాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు, దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ వెల్లడించారు. ఏఎం రత్నం నిర్మించే ఈ చిత్రానికి జిల్లా దర్శకుడు ఆర్టీ నెసన్ డైరక్టర్‌గా వ్యవహరిస్తారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

వేదాలం కథ ఇదే..
వేదాలం చిత్ర కథ ఏంటంటే.. హీరో టాక్సీ డ్రైవర్. ఓ నగరంలో ముగ్గురు అంతర్జాతీయ ఉగ్రవాదులను ఆచూకీని టాక్సీ డ్రైవర్ పోలీసులకు వెల్లడిస్తాడు. పోలీసులకు సమాచారం అందించారనే విషయం తెలుసుకొన్న టెర్రరిస్టులు టాక్సీ డ్రైవర్‌పై ఎలాంటి దాడులు చేశారు.. వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది చిత్ర కథ. ఈ చిత్రంలో చెల్లెలు, ప్రియురాలు పాత్రల ద్వారా సెంటిమెంట్ పండించారు.

125 కోట్ల వసూళ్లు
తమిళంలో సుమారు 61 కోట్లతో రూపొందిన వేదాలం చిత్రం ఘనవిజయం సాధించింది. సుమారు 125 కోట్ల రూపాయలను వసూలు చేసింది. వేదాలంలో హీరోగా అజిత్, శృతిహాసన్, లక్ష్మీ మీనన్ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











