పవన్ కల్యాణ్ కొత్త చిత్రమిదేనట.. ఏఎం రత్నంకు షాక్.. వెనుకబడిన చరిత్ర..
అజ్ఞాతవాసి చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బొక్కా బోర్లా పడిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే తదుపరి చిత్రం ఏమిటనే ప్రశ్నపై సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఓ వారం క్రితం ఏఎం రత్నం నిర్మాతగా చరిత్ర అనే సినిమాను పట్టాలెక్కించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడనే వార్త మీడియాలో షికారు చేసింది. అయితే తాజాగా పవన్ సినిమాకు సంబంధించిన మరో వార్త వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.
Recommended Video


రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్
అజ్ఞాతవాసి సినిమా నిర్మాణ సమయంలో పవన్ కల్యాణ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఏఎం రత్నం ఓ చిత్రం, మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను చేయాల్సి ఉంది.

తమిళ చిత్ర రీమేక్‌లో
శ్రీనివాస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందే సినిమాకు రభస చిత్ర దర్శకుడు సంతోష్ డైరెక్షన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అజిత్ చిత్రం వేదాలం సినిమాలకు రీమేక్ అనే మాట అప్పట్లో వినిపించింది. అయితే తాజాగా తమిళంలో ఘన విజయం సాధించిన పోలీస్ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు సమాచారం.

40 రోజుల్లోనే
రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 40 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని సంతోష్ శ్రీనివాస్‌కు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశాడట. అందుకోసం పక్కా ప్లానింగ్‌తో తన వద్దకు రావాలని సూచించాడట.

త్వరలోనే షూటింగ్
పవన్ కల్యాణ్ సూచన మేరకు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, దర్శకుడు అంగీకరించడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ముందుగా పట్టాలెక్కించే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం.

ముందుగా సంతోష్ శ్రీనివాస్ చిత్రం
అజ్ఞాతవాసి తర్వాత ముందుగా పవన్ కల్యాణ్‌కి సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయడానికి ప్లానింగ్ జరుగుతోందట. సో... పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలోనే ఆరంభం కానున్నదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

ఏఎం రత్నం సినిమా వెనుక్కి
ఒకవేళ మైత్రీ మూవీస్ సినిమా ప్రారంభమైతే పవన్ కల్యాణ్‌తో ఎప్పటి నుంచో చిత్రాన్ని చేద్దామనుకొంటున్న ఏఎం రత్నానికి కొంత షాక్ లాంటి వార్తే ఎదురుకావొచ్చు. ఎందుకంటే మరో సినిమాను పవన్ చేస్తాడా? చేస్తే తనతోనే చేస్తాడా అనే విషయంపై క్లారిటీ లేకపోవడం ఆయనకు ఆందోళన కలిగించే విషయం.

రాజకీయ యాత్ర షురూ..
అజ్ఞాతవాసి సినిమా తర్వాత మరోసారి జనసేన అధినేత హోదాలో ఇరు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రను చేపట్టారు. ఇరు రాష్ట్రాల్లో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పవన్ తన యాత్రను సోమవారం అంటే జనవరి 22న ప్రారంభించాడు.

కొండగట్టు నుంచి యాత్ర
తన రాజకీయ యాత్రకు కరీంనగర్ జిల్లాలోని కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకొన్నాడు. ఆంజనేయస్వామి సమక్షంలో పవన్ కళ్యాణ్ తన తదుపరి కార్యచరణను ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











