పవన్ కళ్యాణ్.... తర్వాతి సినిమాలు ఖరారు!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈచిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి నుంచి ఈచిత్రం షూటింగ్ తమిళనాడులోని పొల్లాచ్చిలో ప్లాన్ చేసారు.
ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రానికి నిర్మాత. జల్సా తరహాలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.
ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాలు ఖరారయ్యాయంటూ ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని వినికిడి. పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది.
అదే విధంగా ప్రముఖ రచయిత కోన వెంకట్ కూడా పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ రానుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులకు కమిట్ ఇచ్చాడనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.


Click it and Unblock the Notifications











