పబ్లిక్ తో కలిసి పవన్ కళ్యాణ్ వాక్...డిటేల్స్

By Srikanya

హైదరాబాద్ : ఫ్యామిలీ ఈవెంట్స్, ఆడియో పంక్షన్స్ వంటి వాటిలో మాత్రమే అరుదుగా కనిపించే పవన్ కళ్యాణ్ ఓ మంచి కారణం కోసం పబ్లిక్ లో కనిపించనున్నారు. ప్రజాహిత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పబడిన 'హృదయ స్పందన ఫౌండేషన్' వారు నిర్వహిస్తున్న ఓ వాక్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ వాక్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.

Pawan Kalyan next Public Appearance for a Good Cause

'వాక్ ఫర్ హార్ట్ రీచ్ ఫర్ ఎ హార్ట్' అని జరగనున్న ఈ కార్యక్రమం వివరాలు....

సమయం: మార్చి 2న సాయంత్రం 6 గంటలకి
వెన్యూ: పివి ఘాట్, నెక్లెస్ రోడ్

ఈ కార్యక్రమంలో మీరుకూడా పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్ కొరకు

https://www.facebook.com/HrudayaSpandanaFoundation ని విజిట్ చేయండి.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'గబ్బర్ సింగ్ 2'. ఈ చిత్రం ప్రారంభం కావటంలో చాలా జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ చిత్రం ప్రారంభం డిలే అవుతూ వచ్చినా స్క్రిప్టు పరంగా పవన్ కి పూర్తి సంతృప్తి చెందాడని అందుకే మార్చి నుంచి కంటిన్యూ షెడ్యూల్ ప్రాంరంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. అత్తారింటికి దారేది తర్వాత పవన్ పూర్తిగా ఈ స్క్రిప్టుపైనే దృష్టి పెట్టారు. కంటిన్యూగా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ లాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని చెప్పుకుంటున్నారు.

'రచ్చ' సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నాడు. 2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్' బ్రాండ్ నేమ్ తో ఈ చిత్రం చేస్తున్నారు. సీక్వెల్...ప్రీక్వెల్ కాదు అని చెప్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు.

ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు త్వరలోనే ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ చిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించినప్పటికీ....'గబ్బర్ సింగ్-2' మాత్రం హిందీ దబాంగ్-2‌ను పోలి ఉండదని అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X