కొత్త చిత్రానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం
పక్కా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. పవర్‌స్టార్‌తో చేయనున్న మా చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. అద్భుతమైన కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. ఇది ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. భారీ ఎత్తున చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ తాజాగా కమిటయిన చిత్రం విశేషాలు చెప్పుకొచ్చారు ఆ చిత్ర నిర్మాత గణేష్ మీడియాకు తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో బడే రవి సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నం-3 చిత్రం షూటింగ్ ముహూర్తం డిసెంబర్‌లో జరుగుతుంది.
ఈ సందర్బంగా గణేష్ బాబు ఈ చిత్రం మరిన్ని విషయాలు చెప్పారు. ఈ కొత్త చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటిస్తారు. గతంలో పవన్‌కళ్యాణ్ సూపర్‌హిట్ చిత్రానికి సంగీతం చేసిన యువ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తారు. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో ఓ సంచలన విజయం సాధించిన చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందిస్తారు.
సమర్ఫకుడు బడే రవి మాట్లాడుతూ "డిసెంబరులో సినిమాను ప్రారంభిస్తాం. 'పులి' తర్వాత పవన్ చేయనున్న చిత్రం ఇదే. జనవరి నుంచి ఏకధాటిగా షూటింగ్ ఉంటుంది. పవన్ ఖాతాలో వైవిధ్యమైన వాణిజ్య విలువలున్న సినిమాగా ఇది మిగులుతుంద"ని అన్నారు. హరీష్ శంకర్ ఇంతకుముందు రవితేజ హీరోగా షాక్ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. అలాగే గణేష్ బాబు సైతం రవితేజ తో ఆంజనేయులు చిత్రాన్ని రూపొందించారు.


Click it and Unblock the Notifications











