Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సర్ ప్రైజ్: నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను వెండి తెరపై చూసి దాదాపు చాలా రోజులైంది. గబ్బర్ సింగ్ తర్వాత ఆయన సినిమా ఏమీ విడుదల కాలేదు. త్వరలో ఆయన నటిస్తున్న ‘గోపాల గోపాల' చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అంతకంటే ముందుగానే పవన్ వెండితెరపై కనిపించబోతున్నాడట. నితిన్ నటిస్తున్న ‘చిన్నదాన నీకోసం' చిత్రంలో పవన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతో తెలాలంటే ఈ వారం విడుదలవుతున్న ఈచిత్రం చూడాల్సిందే.
శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ‘చిన దాన నీకోసం' చిత్రాన్ని ఆయన సోదరి నిఖితా రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి నిఖితా రెడ్డి మాట్లాడుతూ... ‘ప్రేమ, వినోదం, కుటుంబ బంధాలు కలగలిపిన కథ ఇది. కోరుకున్న అమ్మాయి కోసం కథానాయకుడు ఏం చేసాడన్నది తెరపిస్తున్నామన్నారు. ఈచిత్రం విజయంపై పూర్తి నమ్మకం ఉందన్నారు.
ఈ చిత్రానికి "అమృతం" ఫేం హర్షవర్థన్ మాటలు అందిస్తున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలలకు సంగీతం అందించిన అనూప్ సంగీతాన్ని అందించారు. నితిన్ సరసన మిష్టి చక్రవర్తి నటిస్తోంది. సాఫ్ట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే కరుణాకరన్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ గతంలో తన సినిమాల్లో పవర్ స్టార్ మార్కు ఉండేలూ చూసుకున్నాడు. ‘చినదాన నీకోసం' సినిమాలోనూ నితిన్ మరోసారి పవర్ కళ్యాణ్ మార్కు ఉండేలా ప్లాన్ చేసాడు. ఈ సినిమాలోని పాటల్లో, సీన్లలో, నితిన్ స్టైల్ లో మొత్తం పవన్ కళ్యాణ్ ఛాయలే కనిపిస్తుండటం గమనార్హం. ఇక ఈ సినిమాలోని నితిన్ ఇంట్రడక్షన్ సాంగ్....గుడుంబా శంకర్, ఖుషి చిత్రాల్లోని పాటల్లా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో కూడా నితిన్ పవన్ నామ స్మరణ చేసిన సంగతి తెలిసిందే.