»   » నో పాలిటిక్స్....ఓన్లీ మూవీస్: పవన్ కళ్యాణ్ అంతేనా?

నో పాలిటిక్స్....ఓన్లీ మూవీస్: పవన్ కళ్యాణ్ అంతేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘జనసేన'పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ పార్టీ గురించి గానీ, పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే విషయం గురించిగానీ పట్టించుకోవడం లేదని విస్పష్టం. ప్రస్తుతం ఆయన కమిటైన సినిమాలతోనే ఆయనకు తీరడం లేదు. అయితే పార్టీ అంటూ ఒకటి పెట్టాం కాబట్టి.... ఏదైనా సమస్య వచ్చినపుడు స్పందించాలి కాబట్టి అప్పుడప్పుడు అలా మీడియా ముందుకు వచ్చి నాలుగు డైలాగులు దంచడం తప్ప ఆయన ఏమీ చేయలేక పోతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలపై దృష్టి పెట్టడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోందన టాక్ బయట వినిపిస్తోంది. మళ్లీ ఎన్నికల సమయం వరకు చేతిలో ఉన్న సినిమాలు చేస్తూ గడిపేయడం.... ఎన్నికల సమయం దగ్గర పడే సమయానికి మళ్లీ పార్టీ కార్యక్రమాలతో హడావుడి చేసి.... తాను నమ్మిన పార్టీ(అప్పటి ఏదైనా కొవచ్చు)కి మద్దతు ఇచ్చే దిశగా జనసేన తరుపున ప్రజల్లో చైతన్యం తేవడం లాంటివి చేసే అవాకశం ఉందని జనాలు చర్చించుకుంటున్నారు.

Also Read: ఆగిపోయిన పవన్ ..10 సినిమాలు లిస్ట్

Pawan Kalyan... No Politics Only Movies!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్ధార్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను అభిమానుల ముందుకు తేవడానికే ఆయన ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కారణం ఆయన రాజకీయ, సినిమా అనే రెండు పడవలపై ప్రయాణం చేయడమే అని అంటున్నారు. అందుకే ప్రస్తుతానికి రాజకీయాలను కాస్త లైట్ తీసకుని... సినిమాలు త్వరగా పూర్తి చేయాలని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు.

‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా కష్టపడుతున్నారు. భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి చేతిలో ఎంతో కొంత ధనం ఉండాలి కాబట్టి.....సర్దార్ తర్వాత వరుస సినిమాలకు కమిటయ్యారు. ఏప్రిల్ నెలలో సర్దార్ విడుదలైన తర్వాత అదే నెలలో మరో సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని పవన్ భావిస్తున్నారు . ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖుషి డైరెక్టర్ ఎస్.జె.సూర్యతో ఓ చిత్రం కమిటైనట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
No Politics Only Movies...Pawan Kalyan Decided.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu