మెగా ఫ్యాన్స్ కి నిరాశ.. ఆచార్య వేడుకకు పవన్ దూరం..ఎందుకంటే?
మెగాస్టార్ చిరంజీవి- హిట్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమా మీద ప్రేక్షకుల్లో ఏ మేరకు అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఈ నెల 29న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో నేడు(23వ తేదీ) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు.
అయితే ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని ముందు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ ఈ ఈవెంట్‌కు హాజరవట్లేదు. అయితే ఎందుకు ఆయన హాజరు కావడం లేదు అనే వివరాల్లోకి వెళితే

మంచి స్పందన
సైరా తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరు పలు సినిమాల్లో కలిసి కనిపించారు కానీ అవన్నీ అతిధి పాత్రలే. మొట్టమొదటి సారిగా ఈ సినిమాలో వారు కలిసి పూర్తి స్థాయిలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్లుగా నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం వహించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా
ఇక విడుదల తేదీ దగ్గరపడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 23న నిర్వహిస్తున్నారు. తొలుత ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరగగా, తర్వాత హైదరాబాద్ లో జరిగే అవకాశం ఉందని అన్నారు.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడలో నిర్వహిస్తున్నామని సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు.

మెగా ఫ్యాన్స్ నిరాశ
అయితే తాజా సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ నేడు(23వ తేదీన) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడం లేదు. పవన్ కళ్యాణ్ జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరిలో పర్యటించనున్న పవన్ కల్యాణ్ ఆ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

మెగా ఫ్యాన్స్ నిరాశ
ప్రకటించిన విధంగా వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు రావడం లేదు. ఇక ఈ వేడుకకు ఆయన రావట్లేదు అన్న విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. పవన్ ఆచార్య ఈవెంట్‌కు వచ్చి ఉంటే అన్నాతముళ్ళను ఒకే వేదిక మీద ఉంటే ఆ కిక్ వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

అనుమతించేది లేదని
ఇక యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇక పాస్‌తో వచ్చే వ్యక్తులను మాత్రమే ఈవెంట్‌కు అనుమతించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాస్ లేనివారిని లోపలికి అనుమతించేది లేదని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











