twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ మీద రెచ్చిపోయిన శ్రీరెడ్డి: మా అమ్మనంటే ఎక్కడిపోయారు? తల్వార్‌తో నరుకు, మీ హడావుడికి భయపడం....

    By Bojja Kumar
    |

    Recommended Video

    Sri Reddy Comments On Pawan Kalyan

    తన తల్లిని అత్యంత నీచంగా తిట్టిన, తిట్టించిన వ్యక్తులు, వారి వెనక ఉన్న శక్తులను టార్గెట్ చేస్తూ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ ట్విట్టర్లో ట్వీట్స్ వర్షం కురిపించడంతో పాటు... ఉగ్రరూపం దాల్చి ఫిల్మ్ చాంబర్ వద్ద హడావుడి చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ కూడా రావడం, భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో పరిస్థితి మరింత హీటెక్కింది.

    పవర్ స్టార్ ఆవేశం చూసిన చాలా మంది ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన అమ్మనుతిట్టిన వారి తాట తీస్తారని, అందరి లెక్కలు తేలుస్తారsని భావించారు. అయితే అయితే అలాంటిది ఏమీ నిర్వహించకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ హడావుడి తగ్గిన వెంటనే.... శ్రీరెడ్డి యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పలు కామెంట్స్ చేశారు.

    మీ హడావుడికి భయపడి తోక ముడిచే పోరాటం కాదు మాది

    మీ హడావుడికి భయపడి తోక ముడిచే పోరాటం కాదు మాది

    రామ్ గోపాల్ వర్మకు, మహా టీవీకి, టీవీ 9, ఏబీఎన్‌కు నా క్షమాపణలు. నిజాలు త్వరలోనే బయటకొస్తాయి. ఒక రోజు హడావుడికి భయపడి తోక ముడిచే పోరాటం కాదు మాది. 10 సంవత్సరాల క్రితం ఒంటరిగా వచ్చా. చాలా అనుభవించా, ఎవరినీ వదలను.... అంటూ శ్రీరెడ్డి పేర్కొన్నారు.

    ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు

    ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు

    ఏ పొలిటికల్ పార్టీకి, మాకు ఏ విధమైన సంబంధం లేదు. వైఎస్ఆర్‌సిపిని అనుమానించినందుకు చాలా బాధపడుతున్నాను. పొలిటికల్ డ్రామా నాకు చేతకాదు. యాక్టింగ్ పోరాటాలు చేయడం అసలు రాదు...అని శ్రీరెడ్డి తెలిపారు.

     వెన్నపోటు పొడిచిన తమన్నా

    వెన్నపోటు పొడిచిన తమన్నా

    పొలిటికల్ ఎజెండాతో నా వెనక ఉండి వెన్నపోటు పొడిచిన తమన్నా ట్రాన్స్ జెండర్లకే ఒక మచ్చలాంటి వ్యక్తి. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచావ్. చంద్రముఖి, రచన, సోనా రాథోడ్ లాంటి వారిని చూసి నేర్చుకో... అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

    పోరాటాలు ఎవడి సొత్తు కాదు

    పోరాటాలు ఎవడి సొత్తు కాదు

    మహా టీవీ మీద కొంచెం అలిగాను కానీ, మహాటీవీకి మచ్చ పెడితే ఊరుకోను. పోరాటాలు ఎవడి సొత్తు కాదు. ఒక జర్నలిస్టుగా చెబుతున్నాను. జర్నలిస్ట్ జోలికొస్తే బాగోదు.... అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది.

    నేను డబ్బు తీసుకున్నట్లు తెలిస్తే తల్వార్ తో నరుకు

    నేను డబ్బు తీసుకున్నట్లు తెలిస్తే తల్వార్ తో నరుకు

    ప్యాకేజీల కోసం పోరాటాలు చేసే వాళ్లు ఎవరో అందరికీ తెలుసు. ఇదే నా సవాల్.. కమిటీ వేయండి.... నిజాలు బయటకు రావాలి. నేను తీసుకున్నట్లు తెలిస్తే తల్వార్ తో నరుకు....అంటూ శ్రీరెడ్డి సవాల్ విసిరారు.

     మా అమ్మని అన్నపుడు, రోడ్ మీద రేప్‌లు చేస్తామన్నపుడు ఎటు పోయారు?

    మా అమ్మని అన్నపుడు, రోడ్ మీద రేప్‌లు చేస్తామన్నపుడు ఎటు పోయారు?

    మమ్మల్ని మా అమ్మని అన్నపుడు, రోడ్ మీద రేప్‌లు చేస్తామన్నపుడు, యాసిడ్ పోస్తామన్నపుడు, బెదిరింపులతో భయపెడుతున్నపుడు మా బాధ అర్థం కాలేదా? మీ అమ్మ మీకెంతో.... మా అమ్మలు మాకు అంతే.... అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

     మీ ఆధిపత్యం ఇక్కడ కాదు

    మీ ఆధిపత్యం ఇక్కడ కాదు

    మీ ఆధిపత్యం సినిమాలో...మా చాంబర్లో చూపించండి, జర్నలిస్టుల మీద చూపిస్తే బాగోదు. టీవీ 9 మీద బురద జల్లితే... మీకే మరకలు పడతాయి.... అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

    ఈ విజృంభించే ఝాన్సీ లక్ష్మి భాయిని ఆపు చూద్దాం

    ఈ విజృంభించే ఝాన్సీ లక్ష్మి భాయిని ఆపు చూద్దాం

    ఈ విజృంభించే ఝాన్సీ లక్ష్మి భాయిని ఆపు చూద్దాం... నా ప్రాణం పోయినా లెక్కలేదు... వీరీ మరణానికి సిద్ధమే.... అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

     మీ లేడీస్‌కి ఉన్న రెస్పెక్ట్...ఫిల్మ్ పీల్డ్‌లో యాక్ట్ చేసే వారికి లేదా?

    మీ లేడీస్‌కి ఉన్న రెస్పెక్ట్...ఫిల్మ్ పీల్డ్‌లో యాక్ట్ చేసే వారికి లేదా?

    ఇన్ని రోజులు ఏమైపోయారు పెద్ద తలయకాయలు?? ఇపుడు ఒక మాటకి బయటకొచ్చి టీవీల ముందు ఏడుపులు, వార్నింగులు... మేము మీడియాకి వెళ్లి ఏడిస్తే తప్పు, మీరు మీడియా ముందు యేడిస్తే కరెక్టా? వార్నింగ్స్ ఎవరికి ఇస్తున్నారు? ఆడపిల్ల మీద ఇంత ఎంత చిన్న చూపు? మీ లేడీస్‌కి ఉన్న రెస్పెక్ట్...ఫిల్మ్ పీల్డ్‌లో యాక్ట్ చేసే వారికి లేదా?

    English summary
    Actor-politician Pawan Kalyan on Friday morning lashed out at Andhra Chief Minister Chandrababu Naidu for “using the media channels under his control” and diverting attention from the Special Category Status (SCS) to the Sri Reddy issue. Sri Reddy counter to Pawan Kalyan in this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X