శ్రీదేవి ఇకలేరు అంటే నమ్మలేం.. మెగాస్టార్‌తో అంటూ.. పవన్ కల్యాణ్ ఉద్వేగం

By Rajababu

శ్రీదేవి ఇకలేరు అంటే నమ్మలేం... ఆమె నటన చిరస్మరణీయం

- పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షులు

Recommended Video

హార్ట్ ఎటాక్‌‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!

భారతీయ వెండి తెరపై తనదైన ముద్రను వేసిన శ్రీదేవి గారు హఠాన్మరణం నమ్మలేనిదని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. దుబాయిలో వివాహానికి వెళ్ళిన శ్రీదేవిగారు చనిపోయారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. శ్రీదేవిగారి మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

అసమాన అభినయ ప్రతిభతో

అసమాన అభినయ ప్రతిభతో

పవన్ కల్యాణ్ తమ సంతాపాన్ని తెలియజేస్తూ"అసమానమైన అభినయ ప్రతిభతోభారతప్రేక్షక లోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు.శ్రీదేవి గారు ఇక లేరు అనే మాట నమ్మలేనిది... కానీ ఆమె వెండి తెరపై పోషించిన భిన్నమైన పాత్రలన్నీచిరస్మరణీయాలే అని అన్నారు.

చిత్రసీమలో సుస్థిరం...

చిత్రసీమలో సుస్థిరం...

భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్రసీమలో సుస్థిరం. శ్రీదేవి గారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకొనే మానసిక స్థైర్యాన్ని భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను అని పవర్‌స్టార్ పేర్కొన్నారు.

బూచాడమ్మ బూచాడు అని కళ్లు తిప్పుతూ..

బూచాడమ్మ బూచాడు అని కళ్లు తిప్పుతూ..

బాల నటిగా,కథానాయకిగా దక్షిణ భారత సినీ రంగంలో విజయాలు అందుకొన్న శ్రీదేవిగారుఅదే స్థాయిలో హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. బడి పంతులు సినిమాలో బాల నటిగా‘బూచాడమ్మ బూచాడు'అనే పాటలో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ పలికింఛిన హావభావాల్ని ప్రేక్షకులు మరచిపోలేరు అని పవన్ తెలిపారు.

జగదేక వీరుడు చిత్రంలో

జగదేక వీరుడు చిత్రంలో

అన్నయ్యతో జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్య ఇంద్రజగా కనిపించిన తీరు‘మానవా..'అంటూ చెప్పే సంభాషణలు కూడా అందరూ గుర్తు చేసుకొనేవే.శ్రీదేవిగారు అమాయకత్వంతో పలికించే నటన మరచిపోలేనిది అని పవన్ గుర్తు చేసుకొన్నారు.

ఈ తరుణంలో లోకాన్ని వీడటం

ఈ తరుణంలో లోకాన్ని వీడటం

బోనితో పెళ్లి తర్వాత విరామం తర్వాత ఇంగ్లిష్ వింగ్లీష్,మామ్ చిత్రాల్లో నటించి తన శైలిని ఈ తరానికీ చూపించారు. ఇటీవల ఆమె నటించిన మామ్ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. పెద్ద కుమార్తెని కథానాయకిగా చిత్రసీమకి తీసుకువస్తున్న తరుణంలో ఈ లోకాన్ని వీడటం బాధాకరం" అన్నారు.

తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా.. సుబ్బిరామిరెడ్డి

తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా.. సుబ్బిరామిరెడ్డి

‘శ్రీదేవి' హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసింది. నమ్మలేకపోతున్నాను.దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలు. ఆమె మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. బాలీవుడ్ లో యాష్ చోప్రా రూపొందించిన ‘చాందిని, లమ్హే' చిత్రాలు శ్రీదేవి నటజీవితానికి ఎంతో వన్నె తెచ్చాయి. ఆమె కీర్తిని దశ,దిశలా వ్యాపింప చేశాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సాను భూతిని తెలియ జేస్తున్నాను అని డాక్టర్ టీ సుబ్బరామి రెడ్డి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X