పవన్ కళ్యాణ్ టైటిల్ కే పరిమితం-బాలకృష్ణ ఏకంగా గెటప్ తోనే ...
ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న తెలంగాణవాదులు శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన అనంతరం తమ ఆగ్రహావేశాలు ఎలా ఉంటాయో చూసిస్తామని హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. అంటే మరోసారి తెలంగాణలో జోరుగా నిరసనల పర్వం సాగనుందని తెలుస్తోంది. ఈ నిరసనల సెగలు ముందుగా సినీ పరిశ్రమనే తాకుతాయని, తెలుగు చిత్ర పరిశ్రమకే పెద్ద అడ్డంకిగా మారతాయని గతంలోనే నిరూపితమైంది. దాంతో వచ్చే జనవరి నుంచి మార్చి మధ్య విడుదలయ్యే సినిమాల నిర్మాతలకి ఇప్పట్నుంచే వణుకు మొదలయింది.
ఇప్పటికే కొందరు కెసిఆర్ ను కలుసుకుని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారని వదంతులు కూడా వస్తున్నాయి. ఇదిలావుంటే జనవరి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ సినిమా 'పరమవీర చక్ర"కు కూడా తెలంగాణలో ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో దానిని కౌంటర్ చేయడానికి దాసరి మాస్టర్ ప్లానేసినట్టు సమాచారం.
ఈ చిత్రంలో సినిమా హీరోగా నటిస్తున్న బాలకృష్ణతో ఒక సన్నివేశంలో తెలంగాణ పోరాట యోధుడు 'కొమరం భీమ్" వేషం వేయించారని, తెలంగాణ కీర్తిని చాటిచెబుతూ కొన్ని డైలాగ్స్ పెట్టారని అంటున్నారు. బాలయ్యతో దాసరి ఈ సినిమాలో చాలా మంది గొప్పవాళ్ల గెటప్స్ వేయిస్తున్నారు. అందులో భాగంగా 'కొమరం భీమ్" ది కూడా జత చేశారు. దీని వల్ల 'పరమవీర చక్ర" ని తెలంగాణావాదులు ఉపేక్షిస్తారని, ఒకవేళ సినిమాల ప్రదర్శనకు ఏదైనా అవాంతరం అంటూ ఏర్పడితే ఈ సీన్ తో వాళ్లని కూల్ చేసుకోవచ్చునని దాసరి భావిస్తున్నట్టు టాక్.


Click it and Unblock the Notifications











