ఒళ్లు పొగరెక్కి పెళ్లిళ్లు చేసుకోలేదు... నాతో వారికి సుఖం లేదు: పవన్ కళ్యాణ్

By Bojja Kumar

Recommended Video

తన పెళ్లి జీవితం పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశం ఎప్పుడూ హాట్ టాపికే. ప్రస్తుతం సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు సైతం ఇదే అంశాన్ని ఆయుధంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారిపై పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సభలో తగిన సమాధానం ఇచ్చారు. తనకు ఒళ్లు పొగరెక్కి మూడు వివాహాలు చేసుకోలేదని, నాతో వారికి సుఖం లేక వెళ్లి పోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని పవన్ స్టార్ చెప్పే ప్రయత్నం చేశారు.

 నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైనది

నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైనది

మీ ఇష్టానికి నా వ్యక్తిగత జీవితం మీద తిట్టారు. మీ అందరితో కంపేర్ చేసుకుంటే నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైనది. మీ లాగా జీవితాన్ని నేను దాయను. మీరు తిడితే తిట్టండి, మెచ్చుకుంటే మెచ్చుకోండి, చీదరించుకుంటే చీదరించుకోండి. కానీ నేను ఏ విషయం దాయను. బయటకు ఒకటి, లోపల ఒకలా ఉండే మనిషిని కాదు.

సమస్యలు అడిగితే పెళ్లిళ్లు అంటారా?

సమస్యలు అడిగితే పెళ్లిళ్లు అంటారా?

నేను బయట, లోపల కనిపించేది ఒకటే. నేను ప్రజల సమస్య గురించి మాట్లాడుతుంటే.. వాటికి సమాధానం చెప్పలేక నువ్వు మూడు పెళ్లిళ్లు చేసుకున్నావంటే ఏంటి? ఒక పెళ్లి చేసుకుని మీలాగా బలాదూర్ తిరిగే వ్యక్తిని కాదు.

ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు

ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు

నా కర్మ... నాకు కుదరలేదు, అలా జరిగింది... ఏం చేయను? మంచో చెడో జరిగింది. నాకేం ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు. నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టమే. వీడెప్పుడూ బయటివాళ్ల కోసం ఏడుస్తూ ఉంటాడు. వాళ్లకేమైంది, వీళ్లకేమైంది? అని బాధ పడుతుంటాడు. అలాంటి వారితో ఎవరుంటారు?

నాతో వారికి సుఖం లేదు, పార్టీలు.. పబ్బులు లేవు

నాతో వారికి సుఖం లేదు, పార్టీలు.. పబ్బులు లేవు

నాలాంటి వాడి పక్కన ఉండే వారికి సుఖం ఏముంటుంది? అందరూ నన్ను సినిమా యాక్టర్ అంటారు... కానీ నన్ను ఇంట్లో చూస్తే గదిలో ఓ మూలన పుస్తకాలు చదువుతూ కూర్చుంటాను. నా జీవితంలో పార్టీలు, పబ్బులు ఉండవు. ఎప్పుడూ కూర్చుని పుస్తకాలు చదువుతుంటాడు, లేకుంటే ఆవులు దగ్గరో గేదెల దగ్గరో ఉంటాను. లేదంటే ఎవరితోనే మాట్లాడుతూ ఉంటాను.

నా వ్యక్తి గత జీవితం చిన్నాభిన్నం

నాతో ఉండే వారికి ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. అందుకే నా వ్యక్తి గత జీవితం చిన్నాభిన్నం అయిపోయింది. ఇలా అయినందుకు నేనూ ఏడ్చాను. ఆడ పడుచులు, అక్కా చెల్లెళ్లతో కలిసి పెరిగిన వాన్ని, అందరినీ ఎక్కువగా అర్థం చేసుకుంటాను.... కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇలా జరిగింది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X