#PawanKalyanOnInstagram: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషి అయ్యే న్యూస్.. రికార్డులు బ్రేక్!

పవన్ కల్యాణ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ సైతం జోరు చూపిస్తున్నారు. ఓవైపు వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల సమస్యలపై కృషి చేస్తూ నాయకుడు అనిపించుకుంటున్నారు. ఇక ఎన్నికల సమరానికి వారాహి వాహనం ద్వారా ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. సభలు, మాటలు, కౌంటర్లతో ప్రత్యర్థులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యే ఇంట్సె్టింగ్ అప్డేట్ వెలువడింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. తమిళ నటుడు సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ రీమేక్ మూవీ బ్రో చేస్తున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. ఇక గబ్బర్ సింగ్ మూవీతో కెరియర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) సినిమా కూడా చేస్తున్నారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan Opens Instagram Accounts And 447K Followers Following

పవన్ కల్యాణ్-డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రానున్న మరో చిత్రం హరిహర వీరమల్లు. రెండు పార్టులుగా విడుదల చేద్దామనుకుంటున్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ రాజాకీయాల్లో జోరు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ అభిమానుల కోసం ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. పవన్ కల్యాణ్ తన అభిమానులు, ఫాలోవర్లు, కార్యకర్తలతో ఇంట్రాక్ట్ కావడానికి ఇన్ స్టా గ్రామ్ లో చేరారు.

పవన్ కల్యాణ్ ఇన్ స్టా గ్రామ్ ఖాతా తీసుకుంటున్నట్లు ఆయన సోదరుడు నాగబాబు అధికారికంగా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. హి ఈజ్ కమింగ్ టు బ్లాస్ట్ అనే క్యాప్షన్ తో నాగబాబు పోస్ట్ చేశారు. ఇక తాజాగా పవన్ కల్యాణ్ ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ అయింది. ఇప్పటివరకు ఒక్క పోస్ట్ పెట్టని ఈ అకౌంట్ బయోలో ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో జై హింద్ అని రాసుకొచ్చారు. అతి కొద్ది సమయంలోనే 447K మంది పవన్ కల్యాణ్ ను ఫాలో అవుతున్నారు.

Pawan Kalyan Opens Instagram Accounts And 447K Followers Following

పవన్ కల్యాణ్ ను అనుసరిస్తున్న 4 లక్షల 47 వేల మందిలో సెలబ్రిటీలు సైతం ఉన్నారు. పవన్ కల్యాణ్ ఇన్ స్టా ఎంట్రీలో రికార్డ్ కొడతాడని అభిమానులు అనుకుంటున్నారు. ఎలాంటి రికార్డ్స్ నమోదు అవుతాయో, పవన్ కల్యాణ్ ఎలాంటి పోస్టులు పెడతారో, ఎలా కౌంటర్స్ ఇస్తారో ముందు ముందు చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X