లవ్ లీ కోసం సొంతంగా డైలాగులు రాసుకొంటున్నా పవన్ కళ్యాణ్...
పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ వారణాసిలో జరిగింది. వారాణాసిలో షెడ్యూల్ జరుగుతున్న సమయంలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ వెర్షన్ ని అందించలేకపోయాడట.
దాంతో కొన్ని సీన్స్ కి పవన్ కళ్యాణ్ డైలాగులు రాసినట్టు తెలుస్తోంది. పవన్ డైలాగులు రాసిన సీన్స్ ప్లాష్ బ్యాక్ లో వస్తాయట. దర్శకుడు జయంత్ కూడా పవన్ రాసిన డైలాగులకు చాలా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమాకి 'పవన్ కళ్యాణ్ లవ్ లీ"అనే టైటిల్ ను పెట్టాలనుకుంటున్నారు. నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన త్రిష మరియు కృతి కర్బంద హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ త్రిష త్రివిక్రమ్ శ్రీనివాస్ జయంత్ సి పరాన్జీ గణేష్ బాబు pawan kalyan trisha trivikram srinivas jayant c paranji ganesh babu


Click it and Unblock the Notifications