పవన్ తన పులి చిత్రంలో ఎన్ ఎస్ జి కమాండోగా కనిపించి అలరించబోతున్నాడు. నిజానికి ఎన్ ఎస్ జి కమాండోలు అంటే కొద్ది రోజులు క్రిందటి దాకా పెద్ద ఎవరికీ పరిచయం లేదు. అయితే ముంబయి బాంబు ప్రేలుళ్ళ తర్వాత ఆ టీం సాహసాలకు దేశం మొత్తం నీరాజనాలు అర్పించింది. అయితే ఈ వారి గురించి ముందు నుంచే అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పాత్రను పోషించటంతో అంతా ఆయన ముందు చూపును మొచ్చుకుంటున్నారు. ఇక ఆ చిత్రంలో ముంబైకి సంభంధించిన కొన్ని క్లిప్పింగ్స్ కూడా వాడుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మలేషియాలో పూర్తి చేసుకుని హైదరాబాద్ అన్నపూర్ణలో జరుగుతోంది.ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు.శింగనమల రమేష్ నిర్మిస్తున్నాడు.