పంజా పాసుల కోసం ఎగబడ్డ అభిమానులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తిమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో త్వరలో రాబోతున్న సినిమా 'పంజా". ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఈ నెల 19న గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వేడుకలో పాల్గొనేందుకు ఎంతో ఆతురుతగా ఎదురు చూస్తున్న అభిమానులు....ఆ వేడుకలో ఎంటర్ కావడానికి ఇచ్చే పాసుల కోసం ఎగబడ్డారు. సినిమా నిర్మాతలు బుధవారం సాయంత్రం ఈ పాస్ లను డిస్ట్రిబ్యూట్ చేశారు. వీటిని దక్కించుకోవడం కోసం భారీ క్యూ కట్టారు ఫ్యాన్స్. ఈ పాసులపై ఒక వైపు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, సింగర్స్ ఫోటోలు ముద్రించగా...మరో వైపు పంజా టైటిల్ తో కూడిన పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించారు.
పంజా ఆడియో వేడుక లైవ్ కవరేజ్ హక్కులను మా టీవీతో పాటు మహా టీవీ దక్కించుకున్నాయి. ఇందు కోసం ఒక్కో ఛానల్ రూ. 10 లక్షల వరకు నిర్మాతలకు ముట్టజెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రీ - రికార్డింగ్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన అంజలి లావెనియా మరియు సారా జేన్ డయాస్ హీరోయిన్లు గా నటించారు. నీలిమ తిరుమల సెట్టి మరియు శోభు యార్లగడ్డ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, సంగీతం: యువన్‌శంకర్ రాజా, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: పీఎస్ వినోద్, ఆర్ట్: సునీల్ బాబు.


Click it and Unblock the Notifications











