పవన్ ‘పంజా’ పవర్ చూస్తున్న సెన్సార్ సభ్యులు..!
పవన్ కళ్యాణ్ సంచలనం 'పంజా". ఈ చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రామలు ఈరోజో లేదా రేపు జరగనున్నాయని తెలుస్తోంది. 3,4 తేదిలలో 'పంజా"ని సెన్సార్ సభ్యులు చూసేలా ఈ యూనిట్ ఏర్పాటు చేస్తోందని సమాచారం. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే విడుదలకు లైన్ క్లియరైనట్టేనని సమాచారం.
కాగా పంజా ఫస్ట్ లుక్ స్టిల్స్ దగ్గర నుంచి ట్రైలర్స్ విడుదల వరకు ప్రతి విషయంలోనూ సంచలనం సృష్టిస్తున్న 'పంజా" విడుదలకు ముందు నుంచే రికార్డుల పరంపరను మొదలుపెట్టింది. అతి తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ తో విష్ణవర్థన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏరియాల వారీగా రికార్డుస్థాయిలో బిజినెస్ విష్ణువర్థన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏరియాల వారిగా రికార్డుస్థాయిలో బిజినెస్ చేసింది. నైజామ్-కోట్లు, సీడెడె-6.5కోట్లు, నెల్లూరు-1.4కోట్లు, కృష్ణ-2కోట్లు, గుంటూరు -3కోట్లు, వైజాగ్-3కోట్లు, ఈస్ట్ గోదావరి -2.4కోట్లు, వెస్ట్ గోదావరి 2కోట్లు, యుఎస్ ఎ-3కోట్లు, వీటితో ఓవర్సీస్ రైట్స్, ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్ ద్వారా 12కోట్లు..అన్నీ కలిపి సినిమా విడుదలకు ముందే 'పంజా" మొత్తం 50కోట్లు వసూలు చేసింది. విడుదల తర్వాత పవన్ తన పంజా దెబ్బని బాక్సాఫీస్ కు రుచి చూపిస్తాడని ట్రేడ్ వర్గాలు చెబుతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











