యూట్యూబ్‌లో పవన్ డూప్ హల్‌చల్

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'పంజా' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సారాజేన్ డియాస్, అంజలి లవానియాలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది.

ఈ నేపథ్యంలో ఓ పేరడీ షార్ట్ ఫిల్మ్ పుట్టుకొచ్చింది. పవన్ కళ్యాణ్ డూప్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాడు. పంజా సినిమాను 'పంచా' అంటూ పేరడీ చేస్తూ......మ్యాడ్ మ్యాన్ ప్రొడక్షన్స్ అంటూ ఓ టైటిల్ తగిలించి పవన్ కళ్యాణ్ వేషధారణలో సూర్(పులిసి పోయిన) స్టార్ సుజన్ అనే వ్యక్తి ఇందులో హల్ చల్ చేస్తూ కామెడీ పండిస్తున్నారు. జనవరి 1న అప్ లోడ్ చేసిన ఈ వీడియో...ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. శృతి హాసన్ పవన్ సరసన రొమాన్స్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X