పంజా మూవీ ‘ప్రీమియర్ షో’ టిక్కెట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా 'పంజా" డిసెంబర్ 9న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బంధించిన అమెరికాలో ప్రీమియర్ షో టిక్కెట్లను వారం ముందే తయారు చేయించారు. మీరు పక్క ఫోటోలో చూస్తున్నది పంజా మూవీ ప్రీమియర్ షో టిక్కెట్లే. అమెరికాలోని ఫాక్స్ బే సినిమాస్ లో ఈ ప్రీమియర్ షోను డిసెంబర్ 8న ప్రదర్శిస్తున్నారు.
ఇక పంజా సినిమా విశేషాల్లోకి వెళితే...రేపు(డిసెంబర్ 3)న ఈ చిత్రం సెన్సార్ బోర్డుకు పరిశీలన నిమిత్తం వెళ్ల నుంది. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ పంజా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో పవన్ సరసన సారా జేన్ డియాస్, అంజని లవానియాలు నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతానికి శ్రోతల నుంచి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా పవన్ సరికొత్త గెటప్ తో ఇందులో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. జల్సా తర్వాత సరైన హిట్ లేని పవన్ కల్యాణ్ ఈ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలో తన మర్కెట్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











