'పంజా' సోలోసాంగైతే హాట్ హాట్...టైటిల్ సాంగైతే కేక...!
పంజా చిత్రంతో పరిచయమవుతున్న హీరోయిన్ అంజలీ లావానియా ఈ సినిమాతో తెలుగునాట సెగలు పుట్టించడం ఖాయమని చెప్తోంది. ఈ చిత్రంలో ఆమెపై ఓ సోలో సాంగ్ చిత్రీకరించారట. ఎటాంటి హాట్ ఐటమ్ సాంగ్ అయినా కానీ చిన్నబోయే విధంగా ఈ చిత్రంలో ఆ పాట ఉంటుందని అంజలి చెప్తోంది. ఈ పాట చూస్తే ఎవరైనా ఊపిరి తీసుకోవడం మరిచిపోతారని అంటోంది.
మోడల్ గా బాగా పేరు తెచ్చుకున్న అంజలి ఈ చిత్రంలోని పాత్రకి అతికినట్టు సరిపోయిందని దర్శకుడు విష్ణు చెబుతున్నాడు. ఇటీవలే ఆమె చెబుతున్న ఈ హాట్ సాంగ్ ని పూర్తి చేశారని సమాచరం. గీతా కపూర్ ఈ పాటకి నృత్యరీతులు సమకూర్చారు. షీలా కీ జవానీ..అంటూ కత్రినా కైఫ్ బాలీవుడ్ ని ఏ రేంజ్ లో ఊపేసిందో తెలిసిందే. ఆ పాటకి కొరియోగ్రఫీ చేసిన గీత ఈ పాటకి అంతకంటే అద్దిరిపోయే డాన్స్ సమకూర్చారని సమాచారం. స్వతహాగా బెల్లీ డాన్సర్ అయిన అంజలి లావానియా ఈ పాటలో తన టాలెంట్ మొత్తం చూపించిందట. ఇప్పుడు పంజా కోసం వేచి చూసేందుకు మరో సెక్సయస్ట్, ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ యాడ్ అయిందనిపిస్తోంది.
కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఈ నెల 19న గచ్చిబౌలి స్టేడియంలో అతిరథమహారథుల సమక్షంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని మా టీవి లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది. అయితే ఈ చిత్రం ఆడియో విడుదలకు ముందే 'పంజా టైటిల్ సాంగ్ లోని కొన్ని చరణాలు బైటకొచ్చేశాయి. అవి..'నీ చుర చుర చూపులె పంజా, నీ సల సల సల ఊపిరె పంజా...నీ నర నర నరమున నెత్తురె పంజా..." ఈ చరణాలు వింటేనే అర్థమయిపోతోంది పంజా ఏ రేంజ్ లో వుండబోతోందో. పవన్ సినిమా పరవాలేదంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదవుతాయి. ఇక సూపర్ అంటే ఆ చిత్రం సాధించే రికార్డులని ఎవరూ అంచనావేయలేరని కొంత మంది ఫిల్మిం సర్కిల్స్ లో అంటుండం విశేషం.


Click it and Unblock the Notifications











