twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'పంజా' హైలెట్స్ ఇవే

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజాపైనే అందరి దృష్టీ ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హైలెట్సే హాట్ టాపిక్ గా మారాయి. మ్యూజిక్,యాక్షన్ పార్ట్ ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ గా చెప్తున్నారు. అలాగే సినిమా ఫస్ట్ లుక్ మంచి క్రేజ్ తెచ్చుకోవటంతో పాటు..సినిమా చాలా బాగా వచ్చిందనే టాక్ కూడా సినిమా కు ట్రేడ్ లో బాగా ప్లస్ అయ్యింది. వీటితో పాటు సినిమాలో పవన్ పాత్ర చాలా స్టైలిష్ గా మాస్ ఎలిమెంట్స్ తో కలిసి ఉండటమే ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశమైంది.విష్ణు వర్ధన్ గతంలో రూపొందించిన భిళ్లా చిత్రం కూడా ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెరగటానకి బాగా తోర్పడుతున్నాయి. ఊహించని ట్విస్టులుతో సినిమా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, అడవి శేషు, అంజలీ మీద ఓ పబ్ సాంగ్ ని చిత్రీకరించిన బెల్లీ డాన్స్ కూడా చిత్రానకి ప్రత్యేకత తెచ్చిపెట్టనుంది. ఈ పాటను షీలాకి జవాని అంటూ బాలీవు్డ్ లో అదిరిపోయే కొరియోగ్రఫీ చేసిన కొరియోగ్రాఫర్ ని తెచ్చి చేయించారు.

    తమ పంజా చిత్రంలో దెబ్బ తిన్న పులి లాంటి పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనని దర్శకుడు విష్ణు వర్ధన్ అంటున్నారు. ఆయన తన తాజా చిత్రం పంజా చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ... ఒక్క దెబ్బతో నాడీ వ్యవస్థను సైతం విచ్ఛిన్నం చేసే పవర్ పులి పంజాకి సొంతం. అదే దెబ్బతిన్న పులి అయితే... దాన్ని పంజా శక్తి రెట్టింపవుతుంది. ఇక ఎదుట ఉన్నది మదగజం అయినా సరే.. మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇందులో పవన్‌కళ్యాణ్ పాత్ర చిత్రణ ఇదే తరహాలో ఉంటుంది. ఆయన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కి రుచి చూపించే సినిమా ఇది అన్నారు.

    అలాగే ఈ చిత్రంలో అతని పేరు జాక్సన్ రాబర్ట్ అని తెలుస్తోంది. ఈ పాత్ర ఓ మాఫియా డాన్ ది కావటంతో ఆ పాత్ర పేరును పవన్ ఫిక్స్ చేసారు. సారాజేన్ డయాస్, అంజలీ లావానియాహీరోయిన్స్ గా చేస్తున్నారు.నిర్మాతలు నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ..పవన్‌ ఇమేజ్‌ దృష్ట్యా పవర్‌ఫుల్‌ టైటిల్‌ నిర్ణయించాం. కోల్‌కత నేపథ్యంలోని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. న్యూలుక్‌ ఉన్న సినిమా. క్రిష్‌, త్రీఇడియట్స్‌..చిత్రాలకు స్టంట్స్‌ కూర్చిన శ్యామ్‌ కౌశల్‌ అద్భుత యాక్షన్‌నిచ్చారు. 2పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు నడుస్తున్నాయి అన్నారు.

    కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. నవంబరులో పాటలను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.

    English summary
    Pawan Kalyan's characterization and the mass elements incorporated into the flow of Panjaa film are being talked about among the industry circles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X