పవన్ అభిమానుల ప్రకటన (యధాతథంగా)

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగ్రేట్రం చేస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు ఓ ప్రకటన విడుదల చేశారు. అది యదాథదంగా ..

"జనం కోసం జనసేన అధిపతిగా మారిన పవన్ కళ్యాణ్...!!!''

పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ మాత్రమే కాదు అంతకు మించి యూనివర్సల్ పవర్ ఏదో ఉంది. మాటలో ఖచ్చితత్వం,చేతల్లో నిజాయితీ, విధివిధానాల్లో సింప్లిసిటీ.అందుకే ఆయన అఖిలాంద్ర ప్రేక్షకులు ఆరాధ్యుడయ్యాడు. భావ ప్రకటనలో ఆయన శైలి ఎంతో ప్రత్యేకమైనది. తనకు నచ్చిన విషయాన్ని ఎంత సరదాగా పంచుకుంటారో... తనకు నచ్చని విషయాన్ని అంతే ఘాటుగా.. సూటిగా వ్యక్త పరుస్తారు. పవన్ తాను రాజకీయ ప్రవేహం చేస్తున్నది పాలించే స్థాయి కోసం కాదు. ప్రశ్నించే హక్కు కోసం అని ప్రకటించే సరికి... పవన్ పై అప్పటి వరకు ఉన్న అభిమానం ఒక్కసారిగా వేయింతలైంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీ పేరును జనసేన అని ప్రకటించడంత అభిమానులు అనందానికి అవధులు లేకుండా పోయింది.

ముఖ్యంగా యువత పవన్ పార్టీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్ వర్కింగ్ సైట్సలో పవన్ కళ్యాణ్ పేరు మారు మ్రోగుతోంది. తెలుగు వారందరూ వపన్ కళ్యాణ్ పర్టా కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. నిన్నటి వరకు తమ కలల కథానాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ నేడు నాయకుడిగా మారి తమ కష్టాలను తీరుస్తాడని కొండంత ఆశగా ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు వారందరూ ఈ నెల 14న హైటెక్స్ లో అత్యంత భారీగా నిర్వహించబడుతున్న పవన్ రాజకీయ సభను చూసేందుకు ప్రత్యేకించి స్వచ్ఛందంగా స్ర్కీన్ లు ఏర్పాటు చేసకుంటుండం విశేషం. అలాగే ఆ రోజున హైదరాబాద్ కు భారీగా అభిమానులు చేరుకుంటున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ సభలో పవన్ కళ్యాణ్ దాదాపు 45 నిముషాలు ప్రసంగిస్తారిని తెలసే సరికి పవన్ ఏం మాట్లాడతాడు. ఎవరిని గురించి మాట్లాడుతాడు. పవన్ పార్టీ అజెండా ఏమిటి. ఆయన పార్టఅఈ జెండా ఎలా ఉండబోతోంది. వంటి విషయాలపై ఉత్సుకత నెలకొంది. ఇదీ పవన్ కళ్యాణ్ అభిమానులు విడుదల చేసిన ప్రకటన.

Pawan Kalyan Party Name ‘Jana Sena’
14వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో పవన్‌ చేసే ప్రసంగాన్ని ప్రత్యేక స్కీన్‌ల ద్వారా ప్రజలకు వినిపిం'చడానికి వారు రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తన ఇమేజ్‌తో గెలుపు సాధ్యమనుకునే కొన్ని స్థానాల్లోనే పోటీకి దించాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం నియోజకవర్గాలను ఆయన ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X