‘లవ్లీ’ కోసం పక్కా ప్లాన్ తో పవన్ కళ్యాణ్...

By Sindhu

'పులి" ముందు వరకు ప్రతి సినిమాకి చాలా సమయం తీసుకుంటూ, తద్వారా వాటి బడ్జెట్ పెరిగిపోవడానికి పరోక్షంగా కారణమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పంథా పూర్తిగా మార్చుకున్నాడు. 'లవ్లీ" సినిమాని శరవేగంతో పూర్తి చేస్తున్న పవన్ మొత్తం ఆ యూనిట్ నే అబ్బురపరుస్తున్నాడు. మధ్యలో టాలీవుడ్ సమ్మె అడ్డుపడకపోతే ఈపాటికి 'లవ్లీ" పూర్తయి ఉండేదే. త్వరలో ఈ చిత్రాన్ని పూర్తి చేసేసి పవన్ తన తదుపరి సినిమాకి పని మొదలు పెట్టనున్నాడు.

విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపొందే ఆర్కామీడియా సినిమాకి పవన్ డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా వాయువేగంతో పూర్తయి ఇదే ఏడాదిలో విడుదలవుతుందని సమాచారం. విష్ణువర్థన్ సినిమాకీ, 'లవ్లీ"కి మధ్య ఉండే గ్యాప్ ని కూడా పవన్ వృధా కానివ్వట్లేదు. ఈ గ్యాప్ లో సింగీతం తీస్తున్న జీసస్ సినిమాకి వర్క్ చేయనున్నాడు. పవన్ ప్లానింగ్ చూసి ముచ్చటపడుతున్న అభిమానులు ఇదే వేగాన్ని మంచి వయసులో ఉండగా చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. మరి పవన్ ప్లానింగ్ ఎలా వర్క్అవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X