పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే వెళ్ళి కలిసా...వైవియస్ చౌదరి

By Srikanya

ప్రస్తుతం వైవియస్ చౌదరి చిరంజీవి మేనల్లుడు ధరమ్ తేజ తో రేయ్...షౌట్ ఆఫ్ సక్సెస్ అనే చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రంలో హీరోని ఎంపిక చేసిన విధానం వైవియస్ చౌదరి మాటల్లోనే...నేను ఓ రోజు సినిమా ఆఫీసులో స్టోరీ డిస్కషన్స్ జరిపి బయిటకు వస్తూంటే హీరో లక్షణాలున్న ఓ కుర్రాడు క్రికెట్ ఆడుతూ కన్పించాడు. నేను అతన్ని మా సినిమాలో హీరోగా చేస్తావా అని అడిగాను. అతను మా ఫ్యామిలీలో వారే సినిమా ప్లాన్ చే్స్తున్నారని చెప్పాడు. దాంతో ఎవరి అబ్బాయివని అడిగితే చిరంజీవి గారి మేనల్లుడు అని చెప్పారు.

ఆ తర్వాత ఆ కుర్రాడు గురించి పరిశ్రమలో చాలా మందితో డిస్కస్ చేసాను. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి వరకూ వెళ్ళింది. ఆయన నన్ను ఫోన్ చేసి పిలిచారు. వెళ్ళి కలిస్తే. .ఆయన ఈ ప్రపోజల్ పెట్టారు. ఆ తర్వాత చిరంజీవిని కలసి ఒప్పించాము అన్నారు. ఒక్క మగాడు, సలీం వంటి డిజాస్టర్ చిత్రాల వైవియస్ చేస్తున్న చిత్రం ఇది. వైవియస్ చౌదరి ఈ చిత్రాన్ని తన బొమ్మరిల్లు బ్యానర్ పై రూపొందించనున్నారు. ఇక రామ్, ఇలియానాలతో దేవదాసు అనే హిట్ రూపొందించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చౌదరికి ఈ చిత్రం అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతానని వైవియస్ హామీ ఇచ్చి ఒప్పించినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X