సింగిల్ షెడ్యూల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బౌండెడ్ స్ర్కిప్ట్ తో సినిమా...!
'పులి" సినిమా ప్లాప్ తర్వాత జయంత్. సి. పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షెడ్యూల్ తో బిజీ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. 90 రోజుల్లో షూటింగ్ తో ఈ సినిమాని కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడట. సెప్టెంబర్ 23 నుంచి ఆరంభంకానున్న ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేయ్యనున్నారని వినికిడి.
ఇందుకోసం దర్శకుడు జయంత్ సి పరాన్జీ, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి పకడ్బందీగా షెడ్యూల్ జరిగేలా ప్లాన్ వేసుకున్నారట. ఈ చిత్రానికి డైలాగులు అందిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే డైలాగ్ వెర్షన్ పూర్తి చేసి బౌండెడ్ స్ర్కిప్ట్ ఇచ్చాడని సమాచారం. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఎక్కువ టైమ్ తీసుకోకుండానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ జయంత్ సి పరాన్జీ ఇలియానా లవ్ ఆజ్ కల్ పులి జల్సా pawan kalyan jayanth c paranji ileana love aaj kal puli jalsa


Click it and Unblock the Notifications