పవన్ కళ్యాణ్ లాంగ్ హాలీడే ట్రిప్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో పవర్ స్టార్ లాంగ్ హాలిటే ట్రిప్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పుడెప్పుడో తీన్ మార్ చిత్రం తర్వాత హాలిడే ట్రిప్ కు వెళ్లిన పవన్....ఆ తర్వాత పంజా, గబ్బర్ సింగ్ చిత్రాల్లో... వెంటనే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఇలా వరుస షూటింగులతో బిజీగా గడిపాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఇది పూర్తయిన వెంనే యూరఫ్, యూఎస్ లలోని టూరిస్టు ప్లేసుల్లో హాలీడే గడపనున్నాడు. దాదాపు 40 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది.
పవన్ తర్వాతి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. ఈలోగా దర్శకుడు త్రివిక్రమ్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి షూటింగుకు అన్నీ సిద్ధం చేయనున్నాడు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థతో కలిసి నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది.
ఇక కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం విషయానికొస్తే....పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం అక్టోబర్ 18న గ్రాండ్ గా విడుదలవ్వబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. అమ్మడు అందాల ప్రదర్శనపై కూడా ఈచిత్రంలో బాగా ఫోకస్ చేసారని సమాచారం.
పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్


Click it and Unblock the Notifications











