హార్మోనియం వాయిస్తూ పవన్ కళ్యాణ్ (రేర్ ఫోటో)
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ..హార్మోనియం వాయిస్తున్న స్టిల్ చూసారా. ఆయన తాజా చిత్రం అత్తారింటికి దారేది షూటింగ్ గ్యాప్ లో సరదాగా ఇలా హార్మోనియం సవరిస్తూ పోజ్ ఇచ్చారు. సెట్ లో కూడా చాలా సరదాగా ఉండే పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. టీజర్ విడుదలైన దగ్గర నుంచి ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది.
పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అత్తారింటికి దారేది'. త్రివిక్రమ్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ నిర్మిస్తోంది. ఛత్రపతి ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం, టీజర్ ను ఆదివారం ఆవిష్కరించారు.
నిర్మాత మాట్లాడుతూ "బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. జూలై 19న పాటల్ని, ఆగస్ట్ 7న సినిమాను విడుదల చేస్తాం. దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్నిచ్చారు. ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది సినిమా'' అని అన్నారు.
ఈ చిత్రంలో సమంత, ప్రణీత హీరోయిన్స్ . సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, రచన, దర్శకత్వం: త్రివిక్రమ్.


Click it and Unblock the Notifications












