పవన్ పాలిటిక్స్: మహేష్ బాబుకు లాభమేనా?

సినిమాల నుండి చిరంజీవి తప్పుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత....సినీ పరిశ్రమలో చిరంజీవి నెం.1 స్థానం నుండి తప్పుకున్నారు. దాంతో పాటే పరిశ్రమలో చిరంజీవికి ఉన్న క్రేజ్, అభిమానులు కూడా తగ్గుతూ వచ్చారు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగి పోయింది.
అయితే మరో వైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, వరుస హిట్లతో....పవన్ కళ్యాణ్‌కు గట్టి పోటీ ఇస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నెం.1 స్థానం కోసం ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఇటీవల 'అత్తారింటికి దారేది' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్ నెం.1 స్థానానికి మరింత చేరువయ్యాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రూటు రాజకీయాల వైపు మార్చిన నేపథ్యంలో......మహేష్ బాబుకు పోటీ లేకుండా పోతుందని, ఇది ఒక రకంగా మహేష్ బాబుకు లాభమే అని, త్వరలోనే మహేష్ నెం.1 స్థానాన్ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు రెండింటిలోనూ కొనసాగితే....భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమే. ఏం జరుగబోతోందో? చూడాలి.


Click it and Unblock the Notifications