"నీతులు చెప్పొద్దు, వెళ్లిపోండి... పవన్ కళ్యాణ్‌‌ను ప్రశ్నిస్తూనే ఉంటా "

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కొన్ని రోజులుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్... న్యూ ఇయర్ ప్రారంభ వేళ కూడా మరోసారి అదే వైఖరి ప్రదర్శించాడు. ఈ సారి ఆయన వ్యాఖ్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్పందించే వరకు కత్తి మహేష్ తగ్గేలా లేడు. ఆయన తాజా కామెంట్లలో ఈ విషయం స్పష్టమవుతోంది.

 నాకే నీతులు చెబుతారా?

నాకే నీతులు చెబుతారా?

పవన్ కళ్యాణ్ ఇష్యూలో తన వైఖరిని తప్పుబడుతున్న వారిని మహేష్ కత్తి వదడలం లేదు. ‘పవన్ కళ్యాణ్ పిచ్చి సేన బూతుల్ని ఖండించే ధైర్యం లేని వాళ్ళు, నాకు నీతులు చెప్పడంలో మట్టుకు ముందు ఉంటారు.' అంటూ అలాంటి వారిపై ఫైర్ అయ్యాడు.

 మిమ్మల్ని పట్టించుకోమని అడిగానా?

మిమ్మల్ని పట్టించుకోమని అడిగానా?

‘నా గోల నాది. నా బాధ నాది. నా పోరాటం నాది. మిమ్మల్ని పట్టించుకొమ్మని నేను అనడం లేదు. నాకు మద్దత్తు కావాలని నేను కోరడం లేదు. నా వైఖరి మీకు చిరాకుని కలిగిస్తే నన్ను బ్లాక్ చెయ్యండి. అయిపోతుంది' అంటూ మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.

 పవన్ కళ్యాణ్ బాధ్యతా రాహిత్యం అంటూ...

పవన్ కళ్యాణ్ బాధ్యతా రాహిత్యం అంటూ...

నేను ఫోటో పెట్టినా, ఒక వీడియో యూట్యూబ్ లో పెట్టినా, రివ్యూ చెప్పినా ఎక్కడ పడితే అక్కడ నన్ను అమ్మానా బూతులు తిడుతూ, కొడతాము, చంపేస్తాము అని పబ్లిక్ గా బెదిరిస్తుంటే పవన్ కళ్యాణ్ అనే ఒక బాధ్యతారహిత వ్యక్తి, నటుడు, సోకాల్డ్ నాయకుడు ఇంతవరకు ఒక ఖండన కూడా చేయలేదు..... అని మహేష్ కత్తి అన్నారు.

అతడు రాజకీయ జోకర్

అతడు రాజకీయ జోకర్

" బాధ్యత లేని అలాంటి మనిషికి బాధ్యత నేర్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఒక అల్లరి మూకతో అలుపెరగని పోరాటం చేస్తున్నాను. ఒక రాజకీయ జోకర్ ని బాధ్యతగల పౌరుడిగా ప్రశ్నిస్తున్నాను." అంటూ కత్తి మహేష్ కామెంట్స్ చేశారు.

 నా పోరాటాలలో నేను వుంటాను

నా పోరాటాలలో నేను వుంటాను

మీ సుఖాలలో, సంతోషాలతో, ఆనందాలలో మీరు ఉండండి. నా పోరాటాలలో నేను వుంటాను. ఐయామ్ ఎ ఫైటర్ అండ్ విల్ ఫైట్ అండ్ ఐ డోంట్ నీడ్ ఎనీమోర్'. నాతో ఉన్నవాళ్లు నాతో వుంటారు. పోయేవాళ్ళు దయచేసి వెళ్లిపొండి. నా ఫేస్ బుక్ వాల్ నుంచి. నా జీవితం నుంచీ..... అంటూ మహేష్ కత్తి వ్యాఖ్యలు చేశారు.

ప్రాణం కన్నా... ఆత్మగౌరవమే ముఖ్యం

ప్రాణం కన్నా... ఆత్మగౌరవమే ముఖ్యం

ఇదే నా కొత్త సంవత్సరపు నిర్ణయం.... నా ఆత్మగౌరవాన్ని మించింది ఏదీ లేదు. నా ప్రాణంతో సహా! అంటూ మహేష్ కత్తి స్పష్టం చేశారు.

 అభిమానులకు కోపం తెప్పిస్తున్న ఈ దారుణమైన కామెంట్స్

అభిమానులకు కోపం తెప్పిస్తున్న ఈ దారుణమైన కామెంట్స్

"పార్టీ పెట్టి పోటీ చెయ్యకుండా ఇంట్లో కూర్చుంటే 'పిరికిపంద' అంటారు"-హీరో రజనీ కాంత్, అరె... మా స్టేట్ లో పవన్ కళ్యాణ్ అంటామే!!!..... అంటూ కత్తి మహేష్ అత్యంత దారుణమైన కామెంట్స్ చేశారు. కత్తి మహేష్ తీరుపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.

 నా అకౌంట్ తీసేయించడానికి ప్రయత్నిస్తున్నారు

నా అకౌంట్ తీసేయించడానికి ప్రయత్నిస్తున్నారు

"నా ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ని హ్యాక్ చెయ్యడానికి. ఇప్పుడు ఏకంగా తీసేయించడానికి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా గ్రూపుల్లో ఇన్‌స్ట్రక్షన్ వీడియెస్ పెట్టి మరీ ఉద్యమంలా చేస్తున్నారు." అని కత్తి మహేష్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X