For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ అంత దాచుకున్నారా? స్పీచ్ చూస్తే నవ్వొస్తుంది: పరుచూరి

    By Bojja Kumar
    |

    ప్రముఖ తెలుగు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు. మేము మా అంతట మేముగా మాకు సినిమా ఛాన్స్ ఇవ్వండి అని ఎవరినీ అడగలేదని, ఆ నిర్మాతలు మమ్మల్ని అడిగితే మేము ఆ సినిమాలకు రాస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమాకు రాబోయాం. అది జయంత్ గారి దర్శకత్వంలో వచ్చిన 'తీన్ మార్'. కానీ ఆ నిర్మాత గారు సత్యానంద్‌ను అడిగారని తెలియగానే వెనకడుగు వేశాం. లేకపోతే ఆ సినిమా రాసుండే వారం.... అని తెలిపారు.

    పవన్ కళ్యాణ్ ఇప్పుడేదో హీరో అయ్యాడని కాదు

    పవన్ కళ్యాణ్ ఇప్పుడేదో హీరో అయ్యాడని కాదు

    పవన్ కళ్యాణ్ గారికి రాయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు చెప్పాం. ఈ రోజు ఆయన ఏదో పెద్ద హీరో అయిపోయాడని ఈ మాట అనడం లేదు. ఆయన చిరంజీవిగారి ఇంట్లో చిన్న వాడిగా చూసినప్పటి నుండే ఆ విజ్ఞాత, ఆ మౌనం, ఆ ప్రవర్తన చాలా ఇష్టం... అని పరుచూరి తెలిపారు.

     ఆయన స్పీచ్ వింటే నవ్వొస్తుంది

    ఆయన స్పీచ్ వింటే నవ్వొస్తుంది

    పవన్ కళ్యాణ్‌ను చిన్నతనం నుండి గమనించే వాడిని. చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఈ రోజు ఆయన అంత లౌడ్ గా పొలిటికల్ స్పీచ్ ఇస్తుంటే నవ్వొస్తోంది. ఆయన కడుపులో ఇన్నాళ్లు ఇంత ఎమోషన్ దాచుకున్నారా? అనిపిస్తుంది. ఆయన సినిమాలకు రాసే అవకాశం వస్తే తప్పకుండా రాయడానికి మాకు అభ్యంతరం లేదు. నిర్మాతలు అడిగితే రాస్తాం. అజ్ఞాతవాసి గురించి అది చూడగానే తప్పకుండా స్పందిస్తా... అని పరుచూరి తెలిపారు.

    చిరు నట జీవితంలో చరిత్ర సృష్టించే సినిమా

    చిరు నట జీవితంలో చరిత్ర సృష్టించే సినిమా

    సైరా నరసింహా రెడ్డి చిరంజీవిగారి నట జీవితంలో ఒక చరిత్ర సృష్టిస్తుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా నిత్యం తపిస్తున్నాడు. చిరంజీవిని మామూలు నటుడుగానే మీరు రూ. 100 కోట్ల షేర్ ఇచ్చేశారు. అలాంటి నటుడు తొలి స్వాతంత్ర్య సమరమోధుడుగా తెరపై కనిపిస్తున్నపుడు అభిమానులు ఊరికే ఉండరు. అంతకు మించిన హిట్ చేస్తారు. ఆ చిత్రం ఆయనకు, ఆయన అభిమానులకు, ఆయన్ను అభిమానించే ఇండస్ట్రీకి అద్భుతమైన చిత్రం అవుతుంది... అని పరుచూరి తెలిపారు.

     సైరా డైలాగ్ లీక్ చేసి పరుచూరి

    సైరా డైలాగ్ లీక్ చేసి పరుచూరి

    సైరా నరసింహా రెడ్డికి కథ, మాటలు అందిస్తున్న పరుచూరి ఈ సందర్బంగా సినిమాలోని ఓ డైలాగ్ లీక్ చేశారు. ‘వట్టి చేతులతో నేను నిలబడ్డాను. భుజం మీద తుపాకీతో మీరు నిలబడ్డారు. మీసం మీదకు నా చెయ్యి వెళ్లే సరికి నీ బట్టలు తడిసి పోతున్నాయిరా' అంటూ చిరంజీవి ప్రీ క్లైమాక్స్ లో ఓ డైలాగ్ చెప్పనున్నారు. దానికి ముందు, దాని తర్వాత డైలాగులు చెబితే ఇప్పుడే మీ రొమాలు నిక్క బొడుకుంటాయి. ఆల్రెడీ చిరింజీవిగారి వాట్సాఫ్ కు ఆ డైలాగులు పంపించాము... అని పరుచూరి తెలిపారు.

    English summary
    Pawan Kalyan Political Speeches Make Me Laugh says Paruchuri Gopalakrishna in a latest Interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X