పవన్ పార్టీ పొలిటికల్ టీమ్: వారికి చోటు లేదా?

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి ఎలాంటి వారిని తీసుకోబోతున్నారు? ఎవరిని ఎన్నికల్లో నిలబెట్టబోతున్నారు అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది, ఆయన టీంలో ఎవరు ఉంటారు అనేది హాట్ టాపిక్ అయింది.

గతంలో చిరంజీవి పీఆర్పీ పార్టీ స్థాపించినపుడు.....రాజకీయ నిరుద్యోగులను చేర్చుకున్నారు. వారితో పాటు అప్పటి వరకు రాజకీయాలకు సంబంధం లేని కొందరు మంచి వ్యక్తులను సైతం తీసుకున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత చిరంజీవి పార్టీ పెట్టి రాజకీయాలను బ్రష్టుపట్టిస్తున్నారనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు బయటకు వచ్చారు.

Pawan Kalyan

కానీ పవన్ కళ్యాణ్ పెడుతున్న పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి చేసిన తప్పు చేయదని ఆయన సన్నిహితుల నుండి వినిపిస్తున్నవాదన. పవన్ పార్టీలో జంప్ జిలానీలకు, ఇతర పార్టీల్లో టిక్కెట్లు దొరకని వారికి, అవినీతి రాజకీయ నాయకులకు, రాజకీయ నిరుద్యోగులకు స్థానం ఉండదని అంటున్నారు.

పవన్ పార్టీలో సమాజాన్ని మార్చాలనే ధృడ నిశ్చయం ఉన్న మాజీ అధికారులు, వ్యవస్థను మార్చాలనుకే ఎంటర్‌ప్రెన్యూర్స్, నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తున్న వారికి మాత్రమే చోటు ఉంటుందని, అలాంటి వారినే ఎన్నికల్లో నిలబెట్టబోతున్నారని తెలుస్తోంది. మార్చి 14వ తేదీని హైటెక్స్, మాదాపూర్లో ఏర్పాటు చేయబోయే ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన వివరాలన్నీ వెల్లడించనున్నారు.

సాయంత్ర 6 గంటల నుండి 7 గంటల వరకు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఉంటుందని, తాను రాజకీయాల్లోకి రావడానికి గల ఉద్యేశ్యం, లక్ష్యాలను పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరించనున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ ప్రముఖ విప్లవకారుడు చే గెవెరా భావజాలానికి దగ్గరగా ఉంటుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X