AP Assembly Electons జగన్.. నువ్వే నా నాలుగో పెళ్లాం.. నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా జరిగిన మొదటి బహిరంగ సభలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఎన్నడూ ఊహించని విధంగా ఏపీ సీఎంను టార్గెట్ చేస్తూ మాటల యుద్దాన్ని కొనసాగించారు.ఈ సభలో చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణమరాజుతోపాటు టీడీపీ, జనసేన నేతలు భారీగా పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

పవన్ కల్యాణ్ అంటే.. మూడు పెళ్లిళ్లు.. రెండు విడాకులు. కానీ జగన్ మాత్రం నాకు నాలుగు పెళ్లిళ్లు అంటూ విమర్శలు చేస్తుంటాడు. నాకైతే నాలుగో పెళ్లాం ఎవరో తెలియదు. నా నాలుగో పెళ్లాం నువ్వేనేమో. లేని పెళ్లి గురించి మాట్లాడితే.. విసుగు వస్తుంది. నా నాలుగో పెళ్లాం నున్వేరా అంటూ ఘాటుగా స్పందించారు.

Pawan-Kalyan-JSP

జనసేన వాహనావతారాన్ని చూపిస్తుంది. జగన్ గుర్తు పెట్టుకో.. నిన్ను అథోపాళానికి తొక్కకపోతే.. నా పేరు పవన్ కల్యాణ్ కాదు.. నా పార్టీ జనసేన కాదు.. మర్చిపోకు. నెత్తిమీద కాలేసి తొక్కుతా. అప్పుడు అర్ధం అవుతుంది నేనేంటో అంటూ జగన్‌ను హెచ్చరించాడు.

మా అన్నయ్య చిరంజీవి నన్ను యాక్టింగ్ ట్రైనింగ్‌కు పంపించి.. డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించారు. పనిచేసే మార్గాన్ని చూపించారు. నాలాంటి వాడు పనిచేసే వాడు ఉండబట్టే.. కోట్లాది రూపాయలు సంపాదించి.. కౌలు రౌతులకు స్వచ్చందంగా సహాయం చేశాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చి.. డబ్బులు తిన్నానా? వేలాది కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? అవమానాలు, తిట్లు తప్పా నేను ఏం సంపాదించుకొన్నాను. మీరు నన్నే ప్రశ్నిస్తారా? నిజంగా మీరు నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించకండి. నేను సంపాదించిన డబ్బును ప్రజల కోసం ఖర్చు పెట్టాను. నా వెంట నడవాలని జనసేన కార్యకర్తలు, వీర మహిళలను కోరుతున్నాను అని పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు.

Pawan-Kalyan-JanaSenaParty

జనసేనకు పోల్ మేనేజ్‌మెంట్ తెలుసా? సంస్థాగత బలం ఉందా? ఏపీలోని బలమైన పార్టీలతో పోటీ పడగలమా? కార్యకర్తలకు డబ్బులు, భోజనం పెట్టే మన నాయకత్వానికి ఉందా? మన పార్టీ ఎదుగుతున్నది. ఆ లోపు ఏపీని జగన్‌కు తాకట్టు పెట్టలేం అని పవన్ కల్యాణ్ చెప్పారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X