Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అక్కడ పవన్ కి మహేష్ తోడైతే ఇక్కడ ప్రభాస్!
ప్రముఖ ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకోవాలనే కోరికతో ఇటు పవన్ కళ్యాణ్ తో 'పులి" స్టార్ట్ చేశాడు. అటు మహేష్ తో త్రివిక్రమ్ సినిమా మొదలెట్టాడు. ఇంకేముంది ఆ ఇద్దరు హీరోలూ లేట్ లతీఫ్ లే కావడంతో గత రెండేళ్ళుగా నిర్మాణం కొనసాగుతూనే వుంది. శింగనమల బెంగ పెరిగిపోతూనే వుంది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాన్ని నటుడు, నిర్మాత గణేష్ ప్రొడ్యూస్ చెయ్యబోతున్నాడు. హిందీ హిట్ 'లవ్ ఆజ్ కల్" కి రీమేక్ గా రూపొందే ఆ సినిమాకి జయంత్ దర్శకుడు. స్ర్కిప్ట్ తనే ఇస్తానని ముందుకొచ్చిన 'జల్సా"రాయుడు త్రివిక్రమ్ వుండనే వున్నాడు కనుక సదరు సినిమా సెట్స్ కెళ్ళేది ఎప్పుడో..స్ర్కీన్ పైకి వచ్చేది ఎప్పుడో ఇప్పట్లో చెప్పలేం.
అక్కడ పవన్ కి మహేష్ తోడైతే ఇక్కడ ప్రభాస్ జత కలిశాడు. లారెన్స్ డైరెక్షన్ లో ప్రభాస్ చెయ్యాలనుకుంటున్న సినిమాకీ గణేష్ నిర్మాత. దశరథ్ సినిమా పూర్తయ్యాక-రాజమౌళి సినిమా మొదలయ్యాక వీలు చూసుకుని ఈ సినిమాని పట్టాలెక్కించాలనుకుంటున్నాడు ప్రభాస్. మరి రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యేసరికి మన గణేష్ మరో శింగనమల అయిపోతాడేమో..!