పవన్ కళ్యాణ్ పొగడ్తలపై మెగా ఫ్యాన్స్ హ్యాపీ!

By Bojja Kumar

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ హీరోలను అభిమానించే మెగా ఫ్యాన్స్....అప్పుడప్పుడు న్యూస్ ఛానల్స్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న వార్తలపై కలత చెందుతున్నారు. అందుకు కారణం ఇద్దరి మధ్య పొసగడం లేదనే కథనాలు వెలువడటమే. ఆ కథనాలకు కారణం ఇద్దరూ రాజకీయంగా చెరో దారిలో ప్రయాణిస్తుండటంతే. గత ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తన శక్తి మేర ప్రయత్నించారు. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ, టీడీపీల తరుపున ప్రచారం చేసి అన్నయ్య ప్రాతినిధ్యం వహించిన పార్టీని ఓడించడంలో తన వంతు పాత్ర పోషించాడు.

అయితే రాజకీయం రాజకీయమే...కుటుంబం కుటుంబమే అనే విధంగా ఇద్దరూ ముందుకు సాగుతుండటం గమనార్హం. మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అనేక సందర్భాల్లో మెగా హీరోలు వివరణ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, తామంతా ఒకే కుటుంబం, ఎప్పుడూ కలిసే ఉంటామని స్పష్టం చేసారు. పవన్ కళ్యాన్ కూడా అనేక సందర్భాల్లో అన్నయ్య గురించి పాజిటివ్ గా మాట్లాడారు.

Pawan Kalyan praised Chiranjeevi

తాజాగా మరోసారి పవన్ కళ్యాన్ అన్నయ్య చిరంజీవి గురించి మాట్లాడారు. ‘గోపాల గోపాల' ప్రమోషన్లో పాల్గొన్న ఆయన అన్నయ్య గురించి మాట్లాడుతూ...‘నేను అన్నయ్య చిరంజీవిగారిని మాత్రమే హీరోగా చూసాను. ఆయనకు అభిమానులు ఉంటం చూసాను తప్ప నన్ను నేను ఎప్పుడూ హీరోగా అనుకోలేదు. అని సమాధానం ఇచ్చారు. అన్నయ్యగారు, ఎన్టీఆర్, ఎఎన్ఆర్, షారుక్, అజిత్ లాంటి వారు ఎవరి అండా లేకుండా కష్టపడి పైకొచ్చారని' అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆంనదం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య ‘గోపాల గోపాల' ఆడియో వేడుకలో కూడా అన్నయ్య గురించి పవన్ మాట్లాడిన మాటలు అభిమానులను ఆనంద పరిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X