»   » ‘పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు’

‘పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇందుగలడు అందులేడు ఎందెందు వెతికినా అందందే కలడు పవన్ కళ్యాణ్....అన్నట్లు తయారైంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి. పవర్ స్టార్ పాపులారిటీని, ఆయన పేరుకు ఉన్న పవర్‌ను చాలా మంది చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. భారీ ఫ్యాన్ ఫాలోయింగుతో, భారీ వసూళ్లూ సాధించే సినిమాలతో నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ మధ్య పవన్ కళ్యాణ్ పేరును వాడుకుని పైకొచ్చిన వాళ్లు, లాభ పడ్డ వాళ్లు ఇండస్ట్రీటలో చాలా మందే ఉన్నారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ మేనియా బుల్లితెరకు కూడా పాకింది. ఈటీవీ 'జబర్దస్త్' కామెడీ షోలో షకలక శంకర్ పవన్ కళ్యాణ్ పవనిజం కాన్సెప్టును వాడుకుని అందరినీ బాగా నవ్వించాడు. పవన్ కళ్యాణ్‌ ఎఫెక్టుతో ఈ షో టీఆర్పీ రేటింగులు ఒక్కసారిగా భారీగా పెరిగాయి కూడా. ఈ షోలో పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా చూపించారు.

జబర్దస్త్ షోలో చూపించినట్లు.... పవన్ కళ్యాణ్ నిజంగానే కొందరి పాలిట దేవుడుగా మారాడనేది అభిమానుల అభిప్రాయం. ప్లాపుల బాటలో ఉన్న యువ హీరోలను హిట్ బాటలో నడిపించి దేవుడయ్యాడు. నిర్మాతలకు కనక వర్షం కురిపించి దేవుడు అయ్యాడు. మొత్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజిని పెంచి ధీరుడయ్యాడని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం రికార్డు కలెక్షన్లతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. రూ. 100 కోట్ల దిశగా దూసుకెలుతున్న ఈచిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ రేంజి ఏమిటో నిరూపిస్తోంది. రాముడు చెబితే తప్ప హనుమంతుని శక్తి ఏమిటో బయట పడలేదు అనే చందంగా.....పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా వచ్చే దాకా తెలుగు సినిమా మార్కెట్ పరిధి రేంజి ఇంత స్థాయిలో ఉందనేది తెలియలేదు అని అంటున్నారు అభిమానులు.

తాజాగా పవన్ కళ్యాణ్ పేరును వాడుకుని ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తెరెక్కింది. అయితే హీరో పవన్ కళ్యాణ్‌కు....దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆ షార్ట్ ఫిల్మ్ టైటిల్ 'పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు'. ఈ షార్ట్ ఫిల్మ్‌లో హీరో పేరు పవన్ కళ్యాణ్. అతితక్కువ కాలంలోనే ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబులో మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పేరుతో షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఉండటంతో......ఇది ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. దీనికి వెంకట్ కర్నాడి దర్శకత్వం వహించారు. అనిరుధ్ తోటపల్లి, అనిషా అంబ్రోస్, వల్లి విష్ణ బొట్ల, నవ్య పి.రెడ్డి, పటమటలంక నవీన్ నటించారు. సంగీతం: అజయ్ అరసాడ, కెమెరా : మణికళ్యాణ్, ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ : నవీర్ రెడ్డి చింతల, రచన-దర్శకత్వం: వెంకట్ కర్నాడి.

ఫోటోపై క్లిక్ చేసి షార్ట్ ఫిల్మ్ వీక్షించండి

Pawan Kalyan
English summary
Pawan kalyan premalo paddadu Telugu Short film directed by Venkat Karnadi. Anirudh Thotapalli, Anisha Ambrose, Valli Vishnubotla, Navya P Reddy, Patamatalanka Naveen in lead roles. Music by Ajay Arasada, Camera by Mani Kalyan, Executive producer Navien Reddy Chintala, Written and Directed by Venkat Karnati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu