ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకొంటా.. మీ పర్సనల్ లైఫ్ బయటపెట్టాలా? వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయ వారాహి యాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. ఆయన చేపట్టిన తొలి రోజు యాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. బుధవారం సాయంత్రానికి పవన్ కల్యాణ్‌కు కత్తిపూడి సభ ప్రాంగణానికి చేరుకొన్నారు. ఆయనకు కత్తిపూడి ప్రజలు ఘన స్వాగతం పలికారు . ఈ సభలో ఆయన మాట్లాడుతూ..
సినిమా పరిశ్రమలో అత్యంత పారితోషికం తీసుకొనే భారతీయ నటుల్లో నేను ఒకరిని. నాకు మాటలు పాడాల్సిన అవసరం లేదు. నన్ను ప్రేమించే వారే తప్ప తిట్టే వారుండరు. ప్రజలు పడే బాధలను సినిమాల్లో సన్నివేశాలు, పాటల రూపంలో పెట్టుకోవడం ఇష్టం లేక వేదన చెంది.. ప్రజల కోసం ఏదో చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చాను. సినిమా అవకాశాలను, ఆదాయాన్ని వదులుకొని మీ కోసం వచ్చాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

ప్రభుత్వ విధానాలను, నేతల తప్పుడు వ్యవహారాలనే ప్రశ్నిస్తాను. కానీ వారి వ్యక్తిగత జీవితాలపై మాట్లాడి దిగజారే మనస్తత్వం నాది కాదు. కానీ నన్ను ఎంత దారుణంగా తీడుతారంటే.. ముఖ్యమంత్రితో సహ చిన్న నేతలు కూడా తిడుతారు. అయినా నేను వారిని దూషించి దిగజారడం నా విధానం కాదు అని పవన్ కల్యాణ్ అన్నారు.
నేను వైసీపీ నేతలు తిడుతున్నా ఎందుకు భరిస్తున్నాను. కానీ ప్రభుత్వాలు చేసే అక్రమాలు చూడలేక ఆవేదనతో మీ సంక్షేమం కోసం నేను పార్టీ పెట్టాను. నీచంగా మాట్లాడుతూ దిగజారే రాజకీయ నేతలను చూసుకొంటూ వస్తున్నాను. నీచంగా దిగజారే నేతల మాటలను భరించాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

ప్రజల్లో ప్రశ్నించే తత్వం కనుమరుగైపోతున్నది. ప్రభుత్వాలను ప్రశ్నించేందుకే జనసేన పార్టీ పుట్టింది. ఓడిపోతే రాజకీయాలను నుంచి పారిపోతారని అనుకొన్నారు. కానీ ఊహించని సింహగర్జనతో పోరాటం చేస్తున్నాను. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి నన్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అప్పుడు నేను ఫోన్‌లో ఒక పద్దతిగల ప్రతిపక్షంగా ఉంటాం. మీ వ్యక్తిగత విషయాలకు వెళ్లం. పాలసీ ప్రకారమే విమర్శిస్తాం. అలాంటివి రాకుండా చూసుకోమని చెప్పాను అని పవన్ కల్యాణ్ తెలిపారు.
భవన నిర్మాణ కార్మికుల ఘోస చూడలేక నేను ప్రశ్నించడం మొదలుపెడితే.. నా వ్యక్తిగత జీవితంపై కూడా నీచంగా మాట్లాడారు. నా కుటుంబ సభ్యులను దూషణలో టార్గెట్ చేశారు. అలాగని నాకు వైసీపీ నేతల వ్యక్తిగత విషయాలు నాకు బాగా తెలుసు. నా గురించి తెలుసుకోవాలంటే.. వైసీపీకి ఇంటెలిజెన్స్ కావాలి. కానీ నాకు కేవలం అభిమానులు చాలూ అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











