పంజా టీమ్ సామాన్యులు కాదు పవన్ తో ఆ పని చేయిస్తున్నారా..!?
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'పంజా" చిత్రాన్ని డిసెంబర్ 9న ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరగుతున్నాయి. డిసెంబర్, 8న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ షోలను చూడాలనుకునేవారు. అడ్వాన్స్ గా ఆన్ లైన్ బుకింగ్ చేసుకోవచ్చట. ఆన్ లైన్ బుకింగ్ ని ఓపెన్ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా యుయస్ లో మాత్రమే కాకుండా జర్మనీ, డెన్మార్క్, స్వీడెన్, నెదర్ల్యాండ్ ల్లో కూడా విడుదలకు కానుందని సమాచారం.
కాగా ఎప్పుడూ పబ్లిక్ ఫంక్షన్స్ లో కనపడని పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఆడియో ఫంక్షన్ కి హాజరవ్వడమే కాకా స్పీచ్ లతో అదరగొడుతున్నాడు. తను ఏ సినిమా అయినా చేస్తున్నాడంటే ఆ సినిమా సంబందించి మాట్లాడటం చెయ్యడు ఎందుకంటే అది అతను నటించే సినిమా చెబుతుంది ఆ సినిమా రేంజ్ ఏంటో. అంతే కాదు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా చేయడు. అయితే ఇప్పుడు పరిస్థితులను బట్టి పవన్ తో ఇంటర్వ్యూలు, టాక్ షోలను నిర్వహించడానికి పంజా టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. పంజా టీమ్ సామాన్యులు కాదు. అభిమానులకు ఏమి కావాలో బాగా తెలుసు. మూవీ రిలీజ్ టైంలో ఇంటర్వ్యూ అంటే అసలు ఇష్టపడని పవన్ కళ్యాణ్ చేత ఇంటర్వ్యూ అంటే మామూలు విషయం కాదు.


Click it and Unblock the Notifications











