పవన్ తన అభిమానులను నిరాశపరుస్తారా?

By Srikanya

పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' చిత్రం పాటలు జులై 11న మార్కెట్లోకి వస్తాయని రీసెంట్ గా సోనీ మ్యూజిక్ సంస్ధ ఓ ప్రకటనలో తెలియచేసింది. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్ ని సోనీ మ్యూజిక్ వారు భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు. ఇక ఇలా రైట్స్ తీసుకున్న ఆడియో సంస్ధ వారే ఈ పాటలు డైరక్ట్ గా మార్కెట్లోకి వచ్చే రోజు ప్రకటన చేయటంతో ఆడియో పంక్షన్ ఉండే అవకాశం లేదంటున్నారు.

అలా జరిగితే ఆడియో పంక్షన్ కు అటెండవుదామని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమామనల ఆశలపై నీళ్ళు జల్లినట్లే అంటున్నారు.ఇక ఈ ప్రకటన రావటానికి కారణం...పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ఫినిషింగ్ టచెస్ లో బిజిగా ఉండటమా లేక రహమాన్, సూర్య ఇద్దరికీ ఆడియా పంక్షన్ కు అటెండు కాలేనంత బిజీగా ఉండటమో..వీటిల్లో ఏదో ఒకటి జరిగి ఉంటుందంటున్నారు. అయితే కొందరు మాత్రం లేదు...ఈ చిత్రం ఆడియో శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగుతుందని అంటున్నారు. మరి పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

అలాగే ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన నికీషా పటేల్‌ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ పోలీసు అధికారి పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ కూడా పోలీసు బృందంలో సభ్యురాలే. యాక్షన్‌ తరహా కథాంశంతో కూడుకున్న ఈ చిత్రంలో పవన్‌ పాత్ర అందరికీ నచ్చుతుందని అంటున్నాయి. 'ఖుషి' తరవాత పవన్, ఎస్‌.జె.సూర్యల కలయికలో వస్తున్న ఈ చిత్రానికి బినోద్‌ ప్రధాన్‌ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.కనకరత్న మూవీస్ బ్యానర్ పై శింగనమల రమేష్ నిర్మించే ఈ చిత్రంలో శ్రియ ఓ ఐటం సాంగ్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X