అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ పులి నిన్న(మేడే రోజు) (ప్రారంభమైంది. ఇందులో పవన్ తొలిసారిగా ద్వి పాత్రలలో కనిపించనున్నారు. అందులో పోలీసాఫీసర్ పాత్ర ఒకటి. పవన్ కెరీర్ లో బెస్ట్ గా నిలిచిన "ఖుషి" చిత్రాన్ని అందించిన ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించనున్నాడు. దాదాపు యేడేళ్ళ తరువాత మళ్ళీ కలిసిన ఈ కాంబినేషన్ పై చాలా అంచనాలు ఉన్నాయి. "ఖుషి" సినిమా పవన్ కెరీర్ పై ఎంతగా ప్రభావం కలిగించిందంటే అభిమానులు ఆ తరువాత ఎన్ని సినిమాలు వచ్చినా దాంతో పోల్చుకుని ఆ రేంజ్ లో ఊహించుకుని పెద్దగా వాటిని ఆదరించలేదు. అలాగే పవన్ కూడా "ఖుషి" తరహా మేనరిజమ్స్ ని స్టైల్స్ ని కంటిన్యూ వదలక చేస్తూనే ఉన్నాడు. ఆ తరువాత వచ్చిన ప్రతీ సినిమాలో ఆ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. దాంతో ఇంతలా సింక్ అయిన ఈ కాంబినేషన్ పై అందరి కళ్ళూ ఉన్నాయి. గ్యారింటీ హిట్ అన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాని ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ నిర్మిస్తున్నాడు.