'పులి' కి మొదటినుంచీ హీరోయిన్ కోసం వేట సరిపోతోంది. మొన్నా మధ్య ఎంపిక పూర్తయింది హన్సికే హీరోయిన్ అన్నారు. కానీ తాజాగా ఈ చిత్రం షూటింగ్ లో మరో అందాల భరణి దర్శన మిచ్చింది. చిలుకూరు బాలాజీ టెంపుల్ లో జరుగుతున్న ఈ సినిమా సెట్లో నిఖిత ఆనంద్ అనే అమ్మాయి నటిస్తూ కళ్ళబడింది. ఆమె 2003 ఫెమీనా మిస్ ఇండినా యూనివర్స్ విజేత. హిందీలో 'లైఫ్ మె కభీ కభీ' , 'దిల్ దోస్తీ' అనే సినిమాలు చేసింది. మరి ఎందుకీ మార్పు జరిగిందో వివరాలు తెలియరాలేదు. లేకపోతే ముందే అనుకున్న పార్వతీ మిల్టన్ ప్లేసులో వచ్చిందా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి 'ఖుషి' పేమ్ ఎస్.జె.సూర్య దర్శకత్వం చేస్తూండగా పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ కనకరత్నా మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ నిర్మిస్తున్నారు.