పవన్ 'పులి' ఎలా ఉంటుందంటే...

By Staff

'పులి' పులిలా ఉంటాడు. పవన్‌ మీసం చూసే అందరూ బాగుందీ అంటున్నారు. దర్శకులను పవన్‌ బాగా గౌరవిస్తారు. నచ్చితే ఏదైనా చేస్తారు. నమ్మకం కుదిరితే ప్రాణంపెడతారు. ఇవన్నీ ఆయనలో నాకు నచ్చిన గుణాలు. ఆయనతో మరో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 'పులి' తమిళంలో కూడా తీస్తాం. అందులో నేనే నటిస్తా'' అంటున్నారు దర్శకుడు ఎస్‌.జె సూర్య.అలాగే ''నేనూ, పవన్‌ కల్యాణ్‌ మరో సినిమా చేస్తున్నామంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోగలను. వాటిని తప్పకుండా అందుకుంటాం. ఎడిటింగ్‌ థియేటర్లో కూర్చుని చూస్తున్నప్పుడే అభిమానుల ఏయే అంశాలకు బాగా స్పందిస్తారో ముందుగానే వూహించుకుంటున్నాను...అందుకు అనుగుణం గానే ప్లాన్ చేస్తున్నాము అంటున్నారు ఆయన. ఇక ఈ చిత్రం లో పవన్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు.

పవన్‌ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తుండగా లండన్‌కు చెందిన మోడల్‌ నికిష ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమతోంది. ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా, పవన్‌ తండ్రిగా భానుచందర్‌ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందనీ, మరోవైపు ఎడిటింగ్‌ పనులు కూడా జరుగుతున్నాయినీ ఈ చిత్రం యూనిట్‌ వర్గాల సమాచారం. ఈ చిత్రాని ఆగస్టులో రిలీజ్‌ చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.మనోజ్ బాజ్ పాయ్, చరణ్ రాజ్, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, ఆలీ, కోవై సరళ, విఎంసి హనీఫా, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, ఆనందసాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు.

యస్‌.జె.సూర్య దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న 'కొమరం పులి" చిత్రం హైద్రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కనకరత్న మూవీస్‌ పతాకంపై శింగనమల రమేష్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్‌ మొదటివారం నుంచి సినీ సంగీత ప్రియులను అలరించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X