పవన్ కళ్యాణ్ పులి కన్ఫర్మ్ రిలీజ్ డేట్
ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ పులి చిత్రం మే 14న రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం రీరికార్డింగ్ ఏప్రియల్ రెండవ తేదీ నుంచి ప్రారంభమైంది. ఏప్రియల్ 10 నుంచి బ్యాలెన్స్ ఉన్న పాటలు చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. ఇక ప్రముఖ ఫైనాన్సియర్ శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. నిఖిషా పటేల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మనోజ్ బాజపేయి నెగిటివ్ రోల్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ చుట్టూ తిరిగే ఈ కథలో నాజర్, చరణ్ రాజ్, గిరీష్ కర్నాడ్ కీలకపాత్రలు చేస్తున్నారు. వినోద్ ప్రధాన్ కెమెరా అందిస్తూంటే ఖుషీ ఫేమ్ ఎస్ జె సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రీసెంట్ గా పవన్ హీరోగా జయంత్ పరాంన్జీ దర్శకత్వంలో లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ ప్రారంభమైంది. బొత్సా సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాస్యనటుడు గణేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











