'పులి'గర్జించే ఛాన్స్ లేదా?

సినిమా రిలీజు కన్నా ముందు అన్న మెగాస్టార్ ని ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా ఆయన పర్యటనలు,సభలు నిర్వహిస్తున్నారు. సమయం మొత్తం వీటికే సరిపోవడంతో అనుకున్న సమయానికి ఏదీ జరగటం లేదని యూనిట్ సభ్యులు అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. ఈ చిత్రం హిట్ తో పవన్ అటు అభిమానుల్లోనూ,ఇటు పార్టీ వర్గాల్లోనూ ఉత్సాహాన్ని నింపుతారని అంతా అంచనాలు వేసారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం పై విమర్శలు గట్టిగా ఈ చిత్రంలోనే కుమ్మరించారని,సెన్సార్ గడప దాటడం కూడా కష్టమని మరో వాదన వినపడుతోంది.
ఖుషి చిత్రం కాంబినేషన్ కావటంతో ఈ చిత్రంపై ట్రేడ్ లో మంచి క్రేజ్ ఉంది. శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నారు. నికిషా పటేల్ హిరోయిన్ గా చేస్తోంది. పవన్ ఇందులో ద్వి పాత్రలు చేస్తున్నారు. దాదాపు పిప్టీ పర్సంట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆ మధ్య మలేషియా కూడా వెళ్ళివచ్చింది. ఇవన్నీ ఎలా ఉన్నా పవన్ సినిమా రిలీజ్ కోసం రాజకీయాలతో సంబంధం లేకుండా అంతా ఎదురు చూస్తారన్నది నిజం. కాబట్టి ముందు సినమా పనికి క్కూడా ప్రాముఖ్యత ఇచ్చి పూర్తి చేయాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











