'పులి’ ఆడియోతో పవన్ అభిమానులకు సంతోషం అవదులు దాటాయి..!
ఇన్నాళ్లు కాపుకాసి మాటు వేసింది..ఇండస్ట్రీ రికార్డులను వేటాడటం కోసమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'కొమరం పులి" రూపుదిద్దుకుంది..ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో నేడు (ఆదివారం) అంగరంగ వైభవంగా, కనీవినీ ఎరుగనీ రీతిలో విడుదలకు సిద్దమైంది..'జల్సా" తర్వాత పవన్ చిత్రం కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న పవన్ అభిమానులు చిత్రం కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న పవన్ అభిమానులు..చిత్రం పాటలు అల్రెడీ నెట్ లో విని చిత్రం విజయం ఖాయం అంటూ సంబరాలు జరుపుకుంటున్నారు..ఎదుటి వాడికి ఓటమి మనకు గెలుపు కాకూడదు అనే పవర్ స్టార్..మరో మెగాస్టార్ కాబోతున్నాడని మెగాభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు..
పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఎప్పుడూ ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో నుండి కొద్దిగా రొమాన్స్. కామెడీ కలగలపి వస్తున్న గొప్ప యాక్షన్ చిత్రం అని దర్శకుడు ఎస్ జె సూర్య ఆడియో ఫంక్షన్ లో తెలపడంతో పాటు దిగ్రేట్ మ్యూజిక్ డైరక్టర్ ఎఆర్ రెహామాన్ కాంబినేషన్ లో పవన్ గారితో ఈ చిత్రం చేయడం వెనుక చాలా సంతోషపడుతున్నానని ..నేను ఎంత సంతోష పడుతున్నానో అంతకన్నా ప్రేక్షకులు ఎక్కువ సంతోషపడతారని దర్శకుడు సూర్య తెలపడంతో ..పవన్ అభిమానుల సంతోషానికి అవధులే లేవు..
ఇక సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా అభిమానులకు ఈ సినిమా విడుదల ఆగస్ట్ 15వ తారీఖున ఈ సినిమాలను విడుదల తేదీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఈ యూనిట్. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతోంది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా 'కొమరం పులి" రాబోతోంది.


Click it and Unblock the Notifications











