పవన్ కళ్యాణ్ 'పులి' చిత్రం రిలీజు ఎప్పుడంటే..ఎస్ జె సూర్య
పవన్ కళ్యాణ్ హీరోగా రెడీ అవుతున్న కొమురం పులి చిత్రం గురించి చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య మీడియాతో మాట్లాడారు. 'ఖుషి' కంటే పెద్ద హిట్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఇందులో పవన్‌కళ్యాణ్ పాత్ర చిత్రణ చాలా శక్తివంతంగా, ఉత్తేజభరితంగా ఉంటుంది. 'పులి'గా ఓ కొత్త వపన్ కళ్యాణ్‌ని చూస్తారు. ఆయన అభిమానులు అశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఎఆర్ రెహమాన్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం. సాంకేతికంగా కూడా అత్యున్నత స్థాయిలో ఉంటుందీ సినిమా. జనవరిలో ఆడియోను, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నాము' అని చెప్పారు.
ఇక 'ఖుషి' తర్వాత పవన్‌కళ్యాణ్‌తో దర్శకుడు ఎస్.జె.సూర్య చేస్తున్న సినిమా ఇది. కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిషా పటేల్ ఇందులో నాయిక. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో పవన్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. మొదటి సారిగా ద్విపాత్రలో కనిపించనున్నారని సమాచారం. అలాగే పవన్ జల్సా అనంతరం గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం ఇది. ఇక ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్, గిరీష్ కర్నాడ్, చరణ్‌రాజ్, నాజర్, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, అలీ, కోవై సరళ, హనీఫా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బినోద్ ప్రధాన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.బుల్లి సుబ్బారావు, సమర్పణ: ఎస్.సత్యరామమూర్తి.


Click it and Unblock the Notifications











