»   » పులి-సింహా పోరులో విజయం ఎవరిదో!?

పులి-సింహా పోరులో విజయం ఎవరిదో!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిత్రుడు, పాండురంగడు తర్వాత బాలకృష్ణ సింహా. బాలు, జల్సా, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ 'పులి" ఈ వేసవి సెలవుల్లో విద్యార్ధులను వినోదింపచేయనున్నాయి. ఈ రెండు చిత్రాల నిర్మాణ వ్యయం ప్రింట్ కాస్ట్, పబ్లిసిటి వ్యయం అంతా కలిపి మొత్తం వంద కోట్లు వుంటుందని అంచనా! 'మగధీర" హిట్, మళ్ళీ చిరంజీవి ముఖానికి మేకప్ వేసుకుంటారన్న వార్తతో చిరంజీవి అభిమానులు మంచి ఊపుమీద ఉన్నారు. 'పులి" విడుదలను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

జూనియర్ ఎన్టీఆర్ 'అదుర్స్" హిట్. ఎన్టీఆర్ పెళ్ళి వార్తతో కోలాహలంగా వున్న ఎన్టీఆర్ అభిమానులు 'సింహా" విడుదల సందర్భంగా తమ ప్రతాపాన్ని చూపడానికి సిద్దమవుతున్నారు. చూద్దాం ఈ పులి-సింహా పోరులో విజయం ఎవరిదో! ఒకప్పడు ఎన్టీఆర్, అక్కినేని సినిమాల విడుదలకు చిరంజీవి, కృష్ణ సినిమాల విడుదలకు ఈ వాతావరణం కనిపించేది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu