విడాకుల మ్యాటర్‌ : మీడియాకు పవన్ కళ్యాణ్ పంచ్

By Bojja Kumar

హైదరాబాద్ : మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన పవన్...రేణు దేశాయ్‌తో కొంతకాలం సహజీవనం చేసి...ఆమెను తల్లిని చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ మూడో సెటప్ పెట్టారని గత నెలలో వార్తలు గుప్పుమన్నాయి.

తనతో పాటు తీన్ మార్ చిత్రంలో నటించిన 'డానా మార్క్స్' అనే రష్యన్ యువతితో సహజీవనం చేస్తున్నాడని, వీరు అమ్మానాన్నలు కూడా అయ్యారని, 3 నెలల పాపాయి ఉందని.. తెలుగు న్యూస్ చానల్స్‌తో పాటు నేషనల్ మీడియా వెబ్ సైట్స్ కోడై కూసాయి. ఆ తర్వాత ఆ వార్తలన్నీ అవాస్తవమని తేలింది. తీన్ మార్ చిత్ర దర్శకుడు కూడా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

తనపై ఇలా దుష్ర్పచారం చేసిన నేపథ్యంలో....తన తాజా సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా పంచ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ......నన్ను కెలకొద్దు, నాకు తిక్క అనే విధంగా పరోక్షంగా మీడియాకు కామెడీగా వార్నింగ్ ఇచ్చినంత పని చేసారు. ఆ సన్నివేశం మేం చెప్పడం కంటే మీరు సినిమాలో చూస్తేనే బాగుంటుంది.

ఇక 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా విషయానికొస్తే....ఈచిత్రం అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది. కేవలం పొలిటికల్ అంశాల నేపథ్యంలో రూపొందిన ఈచిత్రంలో ఎంటర్ టైన్మెంట్ అంశాలు లోపించడం, స్ర్ర్కీన్ ప్లే యావరేజగ్ గా ఉండటం, జరుగబోయే కథ ప్రేక్షకుడు ముందు ఊహించే విధంగా ఉండటంతో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌కు మాత్రమే ఫుల్ మార్క్స్ పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X